hyderabadupdates.com movies 33 వేల రూపాయలతో సినిమా తీయొచ్చు

33 వేల రూపాయలతో సినిమా తీయొచ్చు

హెడ్డింగ్ చదవగానే కొందరికి నవ్వు వచ్చి ఉండొచ్చు లేదా విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ మొత్తంలో ఈ రోజుల్లో షార్ట్ ఫిలిం తీయడమే అసాధ్యం. అలాంటిది ఒక ఫీచర్ ఫిలిం అసలు ఊహించుకోలేం. కానీ దర్శకుడు రాహి అనిల్ బర్వే దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు. మన్ పిశాచ్ పేరుతో రూపొందిన సైకాలజికల్ హారర్ డ్రామాని 80 నిమిషాల నిడివితో రూపొందించి త్వరలోనే యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నాడు. అసలు ట్విస్టులు ఇంకా ఉన్నాయి.

మన్ పిశాచ్ మొత్తం 60 పేజీల స్క్రిప్ట్. చేత్తో గీసిన స్టోరీ బోర్డులు, ఐఫోన్ లో తీసుకున్న వీడియో రికార్డింగ్స్, ఫోటోషాప్, జనరేటివ్ ఏఐ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వాడి దీన్ని పూర్తి చేశారు. కేవలం ఇద్దరు ఆర్టిస్టులు మాత్రమే ఉంటారు. యానియా భరద్వాజ్, దీపక్ దమ్లే తప్ప ఇంకెవరు వేరే నటీనటులు కనిపించరు. పురావస్తు శాఖకు చెందిన ఒక ఆఫీసర్ సదాశివరావ్ హడమ్ గావ్ అనే ఊరికి వెళ్తాడు. కొండలో నుంచి బయటపడ్డ పెద్ద గుమ్మటం రహస్యం తెలుసుకునేందుకు బరిలో దిగుతాడు.

ఒక పడుచు విధవ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు. చీకటి పడగానే విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకునే హడమ్ గావ్ లో అతనికి ఎదురైన దారుణమైన అనుభవాలే మన్ పిశాచ్ స్టోరీ. ట్రైలర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఏఐ జాడలు స్పష్టంగా కనిపిస్తున్నా అసలు 33 వేల రూపాయల్లో ఈ మాత్రం క్వాలిటీ చూపించడం షాక్ కలిగించే విషయం. భవిషత్తులో ఫిలిం మేకింగ్ మీద కృత్రిమ మేధస్సు ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ.

దీన్ని అనిల్ జీరో బడ్జెట్ ఎక్స్ పరిమెంటల్ ఫిలింగా వర్ణిస్తున్నారు. ఇది విజయవంతమైతే భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో క్లూ ఇస్తున్నాడు. 1960లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మన్ పిశాచ్ రాసుకున్నారు. తుంబాడ్ లాగా ఇది కూడా సక్సెస్ అయితే కొత్త సంచలనానికి దారి తీస్తుందని చెప్పొచ్చు. అయినా నలభై వేలకే ఇంత అవుట్ ఫుట్ రాబడితే ఒకవేళ రెండు మూడు కోట్లు కేటాయించగలిగితే ఏ ప్యాన్ ఇండియా మూవీకి తీసిపోని క్వాలిటీ వస్తుందేమో.

Related Post

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటిలో తెలంగాణకు చెందిన రెండు స్థానాలు ఉన్నాయి. బీఆర్ ఎస్‌కు చెందిన కేఆర్ సురేష్

“Ninnu Choosina” Lyrical Song from Feel-Good Romance “Sky” Wins Hearts“Ninnu Choosina” Lyrical Song from Feel-Good Romance “Sky” Wins Hearts

The latest lyrical song “Ninnu Choosina” from the upcoming feel-good romantic entertainer “Sky” has been released, and it’s already striking the right chord with listeners. Starring Murali Krishnam Raju, Shruti