hyderabadupdates.com Gallery తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం post thumbnail image

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా శ్రీవారి దర్శనానికి సీఎం చంద్రబాబు కుటుంబం ద‌ర్శించు కోవ‌డం విశేషం. ఎప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్ళినా వైకుంఠం క్యూ కాంప్లెక్సు నుంచే దర్శనానికి వెళుతున్నారు. మనవడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి దర్శనానికి సీఎం కుటుంబం ప్ర‌తి ఏటా రావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.
ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, సతీమణి నారా బ్రాహ్మణి, దేవాన్ష్ ఉన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్ కు వెళ్లారు. అక్క‌డ శ్రీ‌వారి భ‌క్తుల‌కు అప్యాయంగా అన్న ప్రసాద వితరణ చేశారు సీఎం చంద్ర‌బాబు, కుటుంబం. ఒక్కరోజు అన్న దానానికి వ్యయం అయ్యే రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే అందించింది సీఎం కుటుంబం. ప్ర‌తి ఏటా వెంగ‌మాంబ అన్న ప్ర‌సాదానికి భూరి విరాళం అంద‌చేస్తూ వ‌స్తున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇదిలా ఉండ‌గా ఇప్పటికీ 12 మార్లు అన్నదానానికి ఎస్వీ అన్నదాన ట్రస్ట్ కు విరాళం ఇచ్చారు.
సీఎం , కుటుంబం రాక సంద‌ర్బంగా తిరుమ‌లలో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. అంత‌కు ముందు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో వెంక‌య్య చౌద‌రి, జేఈఓలు వి. వీర‌బ్ర‌హ్మం, డాక్ట‌ర్ ఎ. శ‌ర‌త్ తో పాటు పూజారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు.
The post తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీటీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బ‌దిలీ

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఈవోగా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేసింది. ఉన్న‌ట్టుండి ఆయ‌న‌ను బ‌దిలీ చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా

గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతిగ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

ఢిల్లీ : మొజాంబిక‌న్ సామాజిక కార్య‌క‌ర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌న‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇందిరాగాంధీ శాంతి బహుమ‌తి ద‌క్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా

జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎదురు దెబ్బ‌లే ఎక్కువ‌జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎదురు దెబ్బ‌లే ఎక్కువ‌

కేర‌ళ : తన జ‌ర్నీ పూల పాన్పులా సాగ‌లేద‌ని అన్నాడు కేర‌ళ క్రికెట‌ర్ , ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సంజు శాంస‌న్. త‌ను మీడియాతో మాట్లాడాడు. త‌న ప్ర‌యాణం సాఫీగా ఏమాత్రం సాగ‌లేద‌న్నాడు. ప్ర‌తి రోజూ నేను ఇవాళే