hyderabadupdates.com Gallery ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్

ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్ post thumbnail image

ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దురంధ‌ర్ -2 దుమ్ము రేపుతోంది. కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆశించిన దానికంటే అద్భుతంగా ఉందంటూ పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ త‌రుణంలో స్పందించాడు న‌టుడు అనుప‌మ్ ఖేర్. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నాడు. ఈ సినిమాను తాను చూశాన‌ని, సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌య్యాన‌ని తెలిపాడు. ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నాడు అనుప‌మ్ ఖేర్.
దురంధ‌ర్ -2 లో ప‌చ్చి నిజాలు చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడ‌ని తెలిపాడు. కొన్నిసార్లు మాటలు కూడా సరిపోవు అన్నాడు. మీరు సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు, మీ అంతరంగంలో ఒక నిశ్శబ్దం ఆవహిస్తుందన్నాడు. ఇది కేవలం ఒక సినిమా కాదని, ఇది ఒక అనుభవం. ఒక భావోద్వేగం. నిశ్శబ్దంగా మీ హృదయంలోకి ప్రవేశించి, ఆపై అక్కడి నుండి బయటకు వెళ్లడానికి నిరాకరించే ఒక ప్రయాణం ఇది అని స్ప‌ష్టం చేశాడు. నాకు కలిగిన భావనలను బంధించడానికి నేను ప్రయత్నించాన‌ని తెలిపాడు అనుప‌మ్ ఖేర్. నేను ఇంకా ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉండగలిగేవాడిని. ఎందుకంటే కొన్ని కథలు కేవలం వర్ణించడానికి ఉద్దేశించినవి కావు అని అన్నాడు. ఇదిలా ఉండ‌గా ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ -1కి దురంధ‌ర్ -2 సీక్వెల్. ఈ మూవీ భారీ క‌లెక్ష‌న్ల‌తో దూసుకు పోతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.
The post ఆదిత్య ధ‌ర్ రియ‌ల్ రాక్ స్టార్ : అనుప‌మ్ ఖేర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలిఎంపీ పుట్టా మహేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి

రాజమండ్రి : తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Ranbir Kapoor Highlights Importance of Personal Identity for Bollywood SuccessRanbir Kapoor Highlights Importance of Personal Identity for Bollywood Success

Bollywood star Ranbir Kapoor, the fourth-generation actor from the legendary Kapoor family, recently stressed that inheriting a film legacy alone does not guarantee success in the industry. Speaking at a

Murder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీMurder: రామచంద్రాపురంలో బాలిక మృతి ఘటనలో వీడిన మిస్టరీ

  డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మైనర్ బాలిక కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 4న తన ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ బాలిక మృతదేహం కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం