hyderabadupdates.com Gallery బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది

బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది

బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది post thumbnail image

మంగ‌ళ‌గిరి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘ఉత్తుత్తి ఆంధ్ర’గా మారి, విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పేర్కొన్నారు. కేవలం రెండేళ్లు కూడా పూర్తికాక ముందే ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్‌గా మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్టాడారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేలా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్చి 23న సోమ‌వారం శంకు స్థాప‌న చేయ‌నున్నార‌ని వెల్ల‌డించారు ఎంపీ.
దాదాపు 1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 2029 కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని చెప్పారు. ఈ ఒక్క పరిశ్రమ ద్వారానే దాదాపు లక్ష మందికి పైగా నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభం కాబోతోందని ప్ర‌క‌టించారు అప్ప‌ల నాయుడ. స్టీల్ ప్లాంట్, ఎయిర్‌పోర్ట్.. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి రెండు కళ్ల వంటివని, ఇవి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర వనరులను దోచుకున్నారు తప్ప, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేయలేదని ఆరోపించారు.
The post బాబు పాల‌న‌లో ప‌రుగులు తీస్తున్న రాష్ట్రాభివృద్ది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లుమాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి ఈడీ స‌మ‌న్లు

విజ‌య‌వాడ : మాజీ ఎంపీ విజ‌య సాయి రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఏపీలో మ‌ద్యం స్కాంకు సంబంధించి ఆయ‌న తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయసాయి రెడ్డికి సమన్లు

CM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుCM Chandrababu: సీఐఐ సదస్సుకు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

    ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొనడానికి ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. వాయుమార్గం ద్వారా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రికి స్థానిక నేత‌లు మరియు

Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్Tejashwi Yadav: మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

Tejashwi Yadav : బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో విపక్ష మహాకూటమి (మహాగఠ్‌బంధన్‌) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) పేరు ఖరారైంది. ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ’ (వీఐపీ) అధినేత ముఖేశ్‌ సాహ్నీ పేరును