hyderabadupdates.com movies రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ అప్పట్లో అభిమానులనే కాదు మాస్ ప్రేక్షకులను కూడా ఊపేసింది. దీని స్ఫూర్తితోనే దర్శకుడు వైవిఎస్ చౌదరి తర్వాతి కాలంలో హరికృష్ణని హీరోగా చేసి సీతయ్యతో శభాష్ అనిపించుకున్నారు. బాలయ్య లక్ష్మి నరసింహ రూపంలో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నారు భగవంత్ కేసరిలో ఖాకీ దుస్తులు వేసింది కాసేపే.

త్వరలోనే బాలకృష్ణ పూర్తి స్థాయి పోలీస్ ఆఫీసర్ ఆ కనిపించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. నాంది, ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల చెప్పిన కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. ఒక టాలీవుడ్ అగ్రనిర్మాత పెద్ద బడ్జెట్ తో దీన్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. విజయ్ కనకమేడల రాసుకునే కథల్లో సందేశం ఉంటుంది. దానికి బాలయ్య మార్కు హీరోయిజం తోడైతే అవుట్ ఫుట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కాకపోతే సమర్ధవంతంగా హ్యాండిల్ చేయాలి.

అంతర్గత వర్గాల ప్రకారం కొన్నేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకుని విజయ్ కనకమేడల ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. రెగ్యులర్ కమర్షియల్ అంశాలు మిస్ కాకుండా సమాజాన్ని ప్రశ్నించే రీతిలో చాలా బాగా వచ్చిందని అంటున్నారు. భారతీయుడు, ఠాగూర్ లో ఎలా అయితే మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా మెసేజ్ ఇచ్చారో అదే తరహాలో ఇది కూడా ఉంటుందని అంటున్నారు.

దీని సంగతి ఆలా ఉంచితే ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమా వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య నెక్స్ట్ వివేక్ ఆత్రేయకు ఎస్ చెప్పిన వార్త తెగ తిరుగుతోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఏది ముందు మొదలవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. మలినేని మూవీని దీపావళి లేదా డిసెంబర్ లో విడుదల చేసే ప్లానింగ్ ఉంది. ఒకవేళ మిస్ అయితే మటుకు బాలయ్య 2027 సంక్రాంతికి ఆల్రెడీ పోటీలో ఉన్న నలుగురైదుగురు హీరోలకు కాంపిటీషన్ అవుతారు.

Related Post

OTT కంపెనీల ప్లానింగ్… భవిష్యత్తు షాకింగ్?OTT కంపెనీల ప్లానింగ్… భవిష్యత్తు షాకింగ్?

కరోనా వచ్చిన సమయంలో నిర్మాతలకు కామధేనువులా వ్యవహరించిన ఓటిటి కంపెనీలు ఇప్పుడు తమ స్ట్రాటజీలు మార్చుకుని నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటిదాకా కాంబినేషన్లు, హైప్ ని ఆధారంగా చేసుకుని భారీ రేట్లతో హక్కులు సొంతం చేసుకున్న ఓటిటిలు ఇప్పుడు షూటింగ్ మొదలుపెట్టక

సజ్జనార్ మాటలు వింటారా?సజ్జనార్ మాటలు వింటారా?

సోష‌ల్ మీడియా యావ‌లో ప‌డిన చాలా మంది యువ‌కులు, య‌వ‌తులు త‌మ ప్రాణాల‌ను కూడా బ‌లి చేసుకుంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇలాంటి అనేక సంఘ‌ట‌న‌లు రోజూ ఎక్క‌డో ఒక చోట జ‌రుగుతూనే ఉన్నాయి. కేవ‌లం లైకులు, వ్యూస్ కోసం యువ‌త త‌మ ప్రాణాల‌ను

నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!నిర్లక్ష్యమే.. నిలువునా కాల్చేసింది!

చిన్నపాటి నిర్లక్ష్యమే కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పది సంఖ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వారం క్రితమే వాటిని అధికారులు పరిశీలించి, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.