hyderabadupdates.com Gallery ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం

ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం

ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం post thumbnail image

న్యూఢిల్లీ/అమరావతి: కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో నిధుల సాధనే లక్ష్యంగా, అభివృద్ధి పనుల ఆమోదమే మార్గంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేపట్టిన ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆయన నివాసంలో మంత్రి దుర్గేష్ కలిశారు. ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో ఐకానిక్ పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక సర్క్యూట్‌ల బలోపేతం కోసం మంత్రి కందుల దుర్గేష్ చేసిన విన్నపాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక మౌలిక సదుపాయాల బలోపేతానికి రూ. 915 కోట్ల విలువైన 9 కొత్త ప్రాజెక్టులతో పాటు, తెలుగు భాష , కళల పరిరక్షణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 6 కీలక సాంస్కృతిక ప్రాజెక్టులపై చర్చించగా కేంద్రం సానుకూలంగా స్పందించింది.
గతంలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన కృషి ఫలితంగా శాస్కి, ప్రసాద్, స్వదేశీ దర్శన్, సిబిడిడి వంటి పథకాల కింద రాష్ట్రానికి ఇప్పటికే మంజూరైన 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ. 430 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వాటి పురోగతిని వివరించి త్వరితగతిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. మంత్రి దుర్గేష్ ప్రతిపాదనల పట్ల కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందిస్తూ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మేరకు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.
The post ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ ఊతం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పీపీపీ మోడ‌ల్ లో ఓడ‌రేవుల నిర్వ‌హ‌ణ : జ‌నార్ద‌న్ రెడ్డిపీపీపీ మోడ‌ల్ లో ఓడ‌రేవుల నిర్వ‌హ‌ణ : జ‌నార్ద‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రంలో ఓడ రేవుల అభివృద్దికి సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర‌ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. గురువారం శాస‌న మండ‌లిలో ప‌లువురు స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. ఎమ్మెల్సీ

CM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబుCM Chandrababu: రేపు యూఏఈకి సీఎం చంద్రబాబు

  విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ దేశంలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి బృందం… ఇప్పుడు యూఏఈకి వెళ్లనుంది. నవంబరు 14,

మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు లైన్ క్లియ‌ర్

హైదరాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, ప్ర‌స్తుతం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా కొన‌సాగుతున్న మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు ఉన్న‌ట్టుండి కొత్త ఏడాది క‌లిసి వచ్చింది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున