hyderabadupdates.com Gallery ప్ర‌ఫుల్ , న‌కీబ్ దెబ్బ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అబ్బా

ప్ర‌ఫుల్ , న‌కీబ్ దెబ్బ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అబ్బా

ప్ర‌ఫుల్ , న‌కీబ్ దెబ్బ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అబ్బా post thumbnail image

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో వ‌రుస విజ‌యాల‌తో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తున్న రియాన్ ప‌రాగ్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇషాన్ కిష‌న్ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. హైద‌రాబాద్ బౌల‌ర్ల దెబ్బ‌కు విల విల లాడింది రాజస్థాన్. నిన్న‌టి దాకా ప‌రుగుల వర‌ద పారించిన బ్యాట‌ర్లు చేతులెత్తేశారు. బంతుల‌ను ఎదుర్కొనేందుకు నానా తంటాలు ప‌డ్డారు. అరంగేట్రంలోనే అదర‌గొట్టాడు ప్ర‌ఫుల్ హింగే. మిస్సైల్స్ లాంటి బంతుల‌తో హోరెత్తించాడు. తొలి ఓవ‌ర్ లోనే కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను కోల్పోయింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. దెబ్బ‌కు కుదేలైంది. అంతే కాదు ఏకంగా అరుదైన రికార్డ్ సృష్టించాడు ప్ర‌ఫుల్ హింగే. మ‌రో వైపు స‌కీబ్ నాలుగు వికెట్లతో హోరెత్తించాడు.
త‌న తొలి ఓవ‌ర్ లోనే ప్ర‌ఫుల్ వండ‌ర్ చేశాడు. రాజ‌స్థాన్ ప‌త‌నాన్ని శాసించాడు. స్టార్ యంగ్ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీని బోల్తా కొట్టించాడు. ధ్రువ్ జురేల్, ప్రిటోరియ‌స్ ల‌ను పెవిలియ‌న్ పంపించాడు. మ‌రో వైపు స‌కీబ్ హుస్సేన్ సైతం క‌ళ్లు చెదిరే బంతుల‌తో షాక్ ఇచ్చాడు. దీంతో 9 ప‌రుగుల‌కే 5 కీల‌క‌మైన వికెట్ల‌ను కోల్పోయింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. చివ‌ర‌కు ప‌రువు పోకుండా కాపాడారు ప్లేయ‌ర్స్ ఫెరీరా, ర‌వీంద్ర జ‌డేజా. అంత‌కు ముందు హైద‌రాబాద్ 217 ర‌న్స్ చేసింది. ఫ్ర‌ఫుల్ హింగే 34 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. న‌కీబ్ హ‌స్స‌న్ 24 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఇషాన్ కిష‌న్ సూప‌ర్ షో చేశాడు. త‌ను 44 బాల్స్ ఎదుర్కొని 91 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.
The post ప్ర‌ఫుల్ , న‌కీబ్ దెబ్బ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అబ్బా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ కు హైకోర్టు బిగ్ షాక్

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. శుక్ర‌వారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు ప్ర‌తికూలంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది.

Ex MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవితEx MLC Kavitha: సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ – కవిత

Ex MLC Kavitha : జాగృతి జనం బాట పేరుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. సామాజిక చైతన్యం కోసమే ‘జాగృతి జనం బాట’ యాత్ర చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

త‌మ‌న్నా ఆజ్ కి రాత్ సాంగ్ బిలియ‌న్ వ్యూస్త‌మ‌న్నా ఆజ్ కి రాత్ సాంగ్ బిలియ‌న్ వ్యూస్

ముంబై : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా భాటియా కీ రోల్ పోషించిన సాంగ్ ఆజ్ కీ రాత్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో టాప్ లో కొన‌సాగుతోంది. ఏకంగా 100 కోట్ల వ్యూస్ సాధించింది. సినీ రంగాన్ని విస్తు పోయేలా