hyderabadupdates.com Gallery దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు అంబేద్క‌ర్

దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు అంబేద్క‌ర్

దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు అంబేద్క‌ర్ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ అని అన్నారు. అంబేద్క‌ర్ 135వ జ‌యంతి సంద‌ర్బంగా ఆయ‌న చిత్ర ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజలు తెలుసుకోవాలి, ఆచరించాలని కోరారు. ఆ మ‌హ‌నీయుడి సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీ పని చేస్తుంద‌న్నారు. నా తెలుగింటి ఆడపడుచు అని ఆప్యాయంగా పిలిచే ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ రోజు నుండే మహిళలకు గౌరవం పెరిగింద‌న్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో ఎందరో మహిళా నేత‌లు త‌యార‌వుతార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా మోదీ సార‌థ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు వంగ‌ల‌పూడి అనిత‌. ఎన్డీఏ ప్రభుత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దళితువాడల్లో వియోగిస్తున్నాం అని చెప్పారు. 2018లో నర్సీపట్నం నియోజకవర్గంలో పోలీస్ స్టేషనులు శంకుస్థాపనలు చేస్తే, ఇప్పుడు మరల ప్రారంభోత్సవాలు చేసుకున్నామన్నారు హోం శాఖ మంత్రి. ఎన్డీఏ ప్రభుత్వం గంజాయిపై ఉక్కు పాదం మోపుతున్నాం అన్నారు. కొన్నిచోట్ల అమాయక గిరిజనులు గంజాయి రవాణా చేస్తూ, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎన్డీపీఎస్ చ‌ట్టాన్ని క‌ఠినంగా అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. రౌడీ మూకలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, PD యాక్ట్ ను పెడుతున్నాం అన్నారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు.
The post దేశం గ‌ర్వించ ద‌గిన మాన‌వుడు అంబేద్క‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM MK Stalin: విజయ్‌ ఆలస్యంగా రావడం వలనే తొక్కిసలాట జరిగింది – స్టాలిన్‌CM MK Stalin: విజయ్‌ ఆలస్యంగా రావడం వలనే తొక్కిసలాట జరిగింది – స్టాలిన్‌

CM MK Stalin : టీవీకే (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా తమిళనాడు అసెంబ్లీలో చర్చజరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌

9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం9న న‌ల్ల‌చెరువును ప్రారంభించ‌నున్న సీఎం

హైద‌రాబాద్ : కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం న‌ల్ల‌చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ ఏర్పాట్ల‌ను ఇత‌ర శాఖల అధికారుల‌తో స‌మీక్షించారు. స‌భా ప్రాంగ‌ణం ఎక్క‌డ

2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది2.65 ల‌క్ష‌ల ఎక‌రాల‌లో ప‌శుగ్రాసాల అభివృద్ది

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపింది. తాజా బ‌డ్జెట్ లో ప‌శు పోష‌ణ‌కు ప్రోత్సాహం క‌ల్పిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. షెడ్యూల్డు కులాలు /