ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అరుదైన ఘనత సాధించారు. తను మరో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది, ఇది ప్రపంచ సంపద ర్యాంకింగ్‌లలో అంబానీని అధిగమించడానికి అతనికి సహాయ పడేలా చేసిందని చెప్పక తప్పదు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా ర్యాంకులను ప్రకటించింది. తాజా డేటా ప్రకారం అదానీ అంబానీని వెనక్కి నెట్టివేసి ముందుకు వచ్చారు. అత్యంత ధనవంతుడిగా అవతరించారు. శుక్రవారం విడుదల చేసిన ర్యాంకింగ్‌ల ప్రకారం అదానీ టాప్ లో నిలిచారు.
గౌతం ఇప్పుడు 92.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ వ్యాప్తంగా 19వ స్థానంలో ఉన్నారు. పోల్చి చూస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ 90.8 బిలియన్ డాలర్ల నికర సంపదతో 20వ స్థానంలో నిలిచారు. అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో ఈ ర్యాంకు చోటు చేసుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా స్టార్ లింక్ వ్యవస్థాపకుడు, ఎక్స్ చైర్మన్ , ఎండీ ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత 286 బిలియన్ డాలర్లతో లారీ పేజ్ , 269 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ ఉన్నారు.
The post ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ
Categories: