రాకా సినిమా కోసం అల్లు అర్జున్ కేవలం హైదరాబాద్ లో ఉంటే సరిపోవట్లేదు. షూటింగ్, ఇతరత్రా కార్యక్రమాల కోసం పదే పదే ముంబై వెళ్లాల్సి వస్తోంది. దీంతో అక్కడో ఇల్లు కొన్నాడని ఒకరు, మూడేళ్లు అక్కడే ఉండిపోతున్నారని మరొకరు ఇలా సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు మొదలుపెట్టేశారు. ట్విస్ట్ ఏంటంటే బన్నీకి అసలు అక్కడ ప్రాపర్టీ కొనే ఆలోచనే లేదట. కేవలం అద్దె ప్రాతిపదికన వెళ్ళినప్పుడంతా ఉండటం కోసం అకామడేషన్ తీసుకున్నారని ముంబై టాక్.
దర్శకుడు అట్లీ సైతం అందులోనే స్టే చేస్తాడని వేరే చెప్పనక్కర్లేదు. విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్, మార్కెటింగ్ తదితర ముఖ్యమైన పనులకు ముంబై వేదిక కానుంది. హైదరాబాద్, చెన్నైలో ఉన్న పరిమిత వనరుల వల్ల అవన్నీ లోకల్ గా ఉండి చేసుకోవడం సాధ్యపడటం లేదు. అందులోనూ ముంబైలో ఉంటే ఇంత కంపెనీల టైఅప్స్, హాలీవుడ్ ప్రొడక్షన్లతో మీటింగులకు అనువుగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
విడుదల తేదీ ఇంకా నిర్ధారణ కానప్పటికీ షూటింగ్ పార్ట్ ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని అల్లు అర్జున్, అట్లీ కృత నిశ్చయంతో ఉన్నారు. విఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం కావాలి కాబట్టి దాని కోసమే అడ్వాన్స్ గా ఉండాలని నిర్ణయించుకున్నారట. పైగా గ్రాఫిక్స్ కోసం పలు అంతర్జాతీయ సంస్థలు వర్క్ చేస్తున్న నేపథ్యంలో వాటికి అనుకూలమైన వేదిక కూడా ముంబై కాబట్టి అన్నీ ఆలోచించి నిర్మాతకు భారం కాకుండా ఇలా సెట్ చేసుకున్నారన్న మాట.
పుష్ప 2 ఇచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ మరింత పెంచుకునే కసితో రాకా కోసం అల్లు అర్జున్ చాలా రిస్కులు చేస్తున్నాడు. మేకోవర్లు, యాక్షన్ ఎపిసోడ్లు, రిస్కీ షాట్లు చాలా విషయాల్లో రాజీ లేకుండా అట్లీ విజన్ కు తగ్గట్టు కష్టపడుతున్నాడని యూనిట్ టాక్. కొంచెం లేట్ అయినా పర్లేదు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారని వినికిడి. రాకా కంటే ముందే వారణాసి వస్తుంది కాబట్టి ఆ స్టాండర్డ్ మ్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా బెస్ట్ లో ఒకటి కాదు అందరికంటే బెస్ట్ ఇవ్వాల్సిందే.