hyderabadupdates.com Gallery కాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేయం

కాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేయం

కాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేయం post thumbnail image

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదన్నారు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం అన్నారు. అన్ని విషయాలపై చర్చలు చేసి, ప్రాజెక్టును పునరుద్ధరించి ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల మరమ్మత్తులకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నీటి పారుదల శాఖ అధికారులు, బ్యారేజీ నిర్మాణ సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి , మంత్రులు, ఎన్డీఎస్ఏ చైర్మన్ , ఇతర ఉన్నతాధికారులతో కలిసి బ్యారేజీ వద్ద జరుగుతున్న పరీక్షలను మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రత్యక్షంగా పరిశీలించారు.
అనంత‌రం సీఎం మీడియాతో మాట్లాడారు. సంబంధిత అన్ని సంస్థలు, సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలతో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ను ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని నిర్ణయించాం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి అందరినీ కలుపుకుని పర్యటనకు వచ్చాం అన్నారు. అలాగే తుమ్మడిహెట్టి వద్ద ఆపేసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించి అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి అక్కడి నుంచి చేవెళ్ల వరకు నీటిని తీసుకు రావడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు సీఎం.
గోదావరి జలాల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలకు సాగు, తాగునీరు అందించాలని ప్రాజెక్టుకు 1975 లో అంకురార్పణ జరిగింద‌న్నారు. వివిధ కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగని నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల నిర్మించాలని 2009 లో ప్రాజెక్టును ప్రారంభించారని చెప్పారు. 160 టీఎంసీల నీటి కేటాయింపులతో రూ. 38,500 కోట్లతో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, అదే విధంగా పరిశ్రమలు, హైదరాబాద్ తాగునీటి కోసం పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండేళ్ల వరకు మొత్తంగా ప్రాజెక్టు కోసం 11,700 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
The post కాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దుచ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు

​అమరావతి : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర

వైసీపీ దుష్ప్ర‌చారంపై మంత్రి కొల్లు ర‌వీంద్ర ఫైర్వైసీపీ దుష్ప్ర‌చారంపై మంత్రి కొల్లు ర‌వీంద్ర ఫైర్

అమ‌రావ‌తి : ఏపీ మంత్రి కొల్లు ర‌వీంద్ర కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌లు చేసే అబ‌ద్దాల‌ను, దుష్ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఆదివారం మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో

సుకుమార్‌ తో చరణ్‌ మూవీ ఎప్పుడంటే!సుకుమార్‌ తో చరణ్‌ మూవీ ఎప్పుడంటే!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పెద్ది షూటింగ్ ఇప్పుడు పూణే ప్రాంతంలో వేగంగా సాగుతోంది. ఇది గ్రామీణ నేపథ్యంలోని క్రీడల ఆధారంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా