hyderabadupdates.com Gallery కంపెనీలు కార్య‌క‌లాపాలు జ‌రిపేలా చూడాలి

కంపెనీలు కార్య‌క‌లాపాలు జ‌రిపేలా చూడాలి

కంపెనీలు కార్య‌క‌లాపాలు జ‌రిపేలా చూడాలి post thumbnail image

హైద‌రాబాద్ : పెట్టుబడులకు సంబంధించి వివిధ వేదికలపై తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్ లో ప‌లు కంపెనీల‌తో కుదిరిన అవ‌గాహ‌న ఒప్పందాలు కార్యరూపం దాల్చడంలో ఆయా సంస్థల కార్యకలాపాల పురోగతిపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వ‌హించారు. మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో పాటు సీఎస్ రామ‌కృష్ణారావు , ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించి పేరు ప్రఖ్యాతులున్న సంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు సీఎం. వివిధ రంగాలలో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులు సమావేశంలో వివరించారు. ఫ్యూచ‌ర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో సంస్థలకు ప్రాధాన్యతల వారీగా కేటాయించాల్సిన భూ వివరాలను తెలిపారు. అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలకు వివిధ ప్రాంతాల్లో కేటాయించాల్సిన భూములకు సంబంధించి భూసేకరణ పెండింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు సీఎం.
కంపెనీలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, భవిష్యత్ అవసరాలకు సంబంధించి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటి కోసం ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు . ఫ్యూచ‌ర్ సిటీలో కార్యాల‌యం ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేసి అక్క‌డే ఎంవోయూల అమ‌లు, పురోగ‌తిపై నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని అన్నారు. ఏ ఏ ఎంవోయూలు ఎప్పుడు కుదుర్చుకున్నాం, అవి ఏ స్థితిలో ఉన్నాయి, అమ‌లుకు ఉన్న ఆటంకాలు, వాటి పెట్టుబ‌డులు, ఆ సంస్థలు క‌ల్పించే ఉద్యోగాల వంటి అన్ని వివరాలు సీఎంఓ, ఆయా శాఖ‌ల మంత్రులు తెలుసుకునేలా రియల్ టైమ్ అప్‌డేట్స్‌తో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.
The post కంపెనీలు కార్య‌క‌లాపాలు జ‌రిపేలా చూడాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలిఎన్నారైలు స‌మాజాభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాలి

గుంటూరు జిల్లా : ఎన్నారైలు స‌మాజ అభివృద్దిలో కీల‌క పాత్ర పోషించాల‌ని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. శుక్ర‌వారం గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్రభుత్వంలో, పాలనలో అనేక కార్యక్రమాల్లో

Minister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్షMinister Nara Lokesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి లోకేశ్‌ సమీక్ష

    మొంథా తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మరో 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు

స్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హంస్పీక‌ర్ నిర్వాకం జ‌గ‌దీశ్ రెడ్డి ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. స్పీక‌ర్ న్యాయ బద్ధంగా పని చేయడం లేద‌ని