hyderabadupdates.com Gallery పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్

పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్

పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్ post thumbnail image

అన‌కాప‌ల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని, పెట్టుబడుల్లో భారత్‌లోనే అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం జిల్లా లోని రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటీవలే ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందన్నారు. రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇన్ గాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి వెనుకబడిన ప్రాంతంగా ఉండేద‌న్నారు. కానీ ఇప్పుడు ఆ జిల్లానే సంపద కలిగిన ప్రాంతంగా మారి పోయింద‌ని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
విశాఖ సమీపంలోని అనకాపల్లి మరో రంగారెడ్డి జిల్లాగా తయారవుతుందని ధీమా వ్య‌క్తం చేశారు. కేంద్ర మాజీమంత్రి దివంగత యశ్వంత్ సిన్హా కుమారుడు ఈ సోలార్ వేఫర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో పెట్టుబడులు పెట్టి దాని కోసం ఆయన ఏపీని ఎంచుకున్నార‌ని తెలిపారు. అభివృద్ధి సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఓ భాగంగా ఉంటుంద‌న్నారు. ఎంత విద్యుత్ వినియోగిస్తే అంత అభివృద్ధి సాధించిన‌ట్టేన‌ని చెప్పారు. అందుకే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. గత పాలకులు విధ్వంసం చేసిన ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మాణం చేయాలన్న లక్ష్యంతోనే కూటమి ప్రజా ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందన్నారు.
The post పెట్టుబ‌డుల్లో అన‌కాప‌ల్లి దేశంలోనే నెంబర్ వ‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలుశ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 10, 24వ

రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బ‌డ్జెట్రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బ‌డ్జెట్

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ 2026-2027 సంవ‌త్స‌రానికి ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక బ‌డ్జెట్ అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన

CM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎంCM Chandrababu: నిర్దిష్ట సమయంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే – సీఎం

CM Chandrababu : రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని, నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దిష్ట సమయంలోగా భవనాల పనులు పూర్తి