hyderabadupdates.com Gallery వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు post thumbnail image

తిరుమల : తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అర టన్ను పండ్లు, 30 వేల కట్ ఫ్లవర్స్ తో 100 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అదేవిధంగా శ్రీ శ్రీనివాస పద్మావతి పరిణయం, గజ వాహనంపై విష్ణుమూర్తి, గజ లక్ష్మి, తామరపువ్వుపై విష్ణుమూర్తి, గోపాల కృష్ణుడు, అష్ట లక్ష్ముల రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శనివారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామి వారికి, అమ్మ వార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీ స్వామి వారికి కొలువు (ఆస్థానం) జరిగింది.
ఈ క్రతువుల అనంతరం వివిధ రాగ- తాళ-వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.
The post వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మోసం నారా చంద్ర‌బాబు నాయుడు నైజంమోసం నారా చంద్ర‌బాబు నాయుడు నైజం

అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మోసానికి చిరునామా అని పేర్కొన్నారు. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారన్నారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్

శ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవోశ్రీ‌వారి సేవకుల సూచ‌న‌లు అత్యంత విలువైన‌వి : ఈవో

తిరుమ‌ల : తిరుమలకు విచ్చేసే భక్తులకు నిస్వార్థంగా సేవలందిస్తున్న శ్రీవారి సేవకులు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తమ సూచనలు కూడా ఇవ్వాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కోరారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్-2ను తొలిసారిగా సందర్శించిన ఈవో సేవకులకు ముందుగా

భారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలిభారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి

అమ‌రావ‌తి : భార‌త దేశం ఔన్న‌త్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువల‌ను ప్ర‌త్యేకంగా విద్యార్థుల‌కు తెలియ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్సీ , ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కొణిద‌ల‌. 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సోమ‌వారం ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు