hyderabadupdates.com Gallery రైతులు న‌ష్ట‌పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా : అచ్చెన్నాయుడు

రైతులు న‌ష్ట‌పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా : అచ్చెన్నాయుడు

రైతులు న‌ష్ట‌పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా : అచ్చెన్నాయుడు post thumbnail image

అమరావతి : రైతులు న‌ష్ట పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో రబీ సీజన్ వరి పంట కోతలు, డీజిల్ సరఫరా, వాతావరణ పరిస్థితులపై 9 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం వరి కోతలు అత్యంత కీలక దశలో కొనసాగుతున్న నేపథ్యంలో కంబైన్ హార్వెస్టర్లకు డీజిల్ సరఫరా ఎక్కడా అంతరాయం కలగకుండా నిరంతరంగా కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా సమీక్షించినప్పుడు ఉభయ గోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కోతలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున డీజిల్ అవసరం అధికంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్నందున అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచాలని సూచించారు. మరోవైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కోతలు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు.
ఫీల్డ్ స్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు పెరగడం, ట్యాంకర్ల సరఫరా ఆలస్యం, జిల్లాల మధ్య హార్వెస్టర్ల మార్పిడి వల్ల అకస్మాత్తుగా డీజిల్ డిమాండ్ పెరుగుతున్నట్లు గుర్తించామని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లను పంపించడం, ముఖ్యమైన పెట్రోల్ బంకుల్లో ముందస్తు నిల్వలు ఏర్పాటు చేయడం, హార్వెస్టర్లకు ప్రత్యేక క్యూ , టోకెన్ వ్యవస్థ అమలు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ డీజిల్ సరఫరా కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
The post రైతులు న‌ష్ట‌పోకుండా డీజిల్ స‌ర‌ఫ‌రా : అచ్చెన్నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలిభ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

హైద‌రాబాద్ : గోదావ‌రి పుష్క‌రాల‌ను క‌నీవిని ఎరుగ‌ని రీతిలో నిర్వహించాల‌ని అన్నారు మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్. సెక్రటేరియట్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశంజరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టంBihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం

    బిహార్‌లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. నవంబర్‌ 14న ఫలితాలు వెల్లడి కానుండగా… ఆయా సర్వేలు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెల్లడించాయి. వీటిలో ఎక్కువగా

అశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లుఅశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లు

తాను జ్యోతిష్కుడిన‌ని, ఆపై దైవాంస సంభూతుడినంటూ పెద్ద ఎత్తున మోసాల‌కు, లైంగిక వేధింపుల‌కు, బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డిన దొంగ బాబా అవ‌తారం ఎత్తిన అశోక్ ఖార‌త్ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ దేశంలో న‌కిలీ బాబాలు,