hyderabadupdates.com Gallery అంగ‌రంగ‌ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

అంగ‌రంగ‌ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

అంగ‌రంగ‌ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు post thumbnail image

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. మే 1 శుక్ర‌వారం ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల భక్తులకు శారీరక, మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం.
వసంతోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు.
టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వార‌పు తోట‌లో శేషాచ‌లం అడవిని త‌ల‌పించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పుష్పాలు, జంతువుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసలు, చిలుకలు వంటి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో 300 కేజిల వ‌ట్టి వేరు, 500 కేజిల సాంప్ర‌దాయ పుష్పాలు, 15 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌తో వివిధ ర‌కాల ఫలాలు వినియోగించారు. ఇందులో బెంగళూరు, హైద‌రాబాద్‌కు చెందిన అలంకరణ నిపుణులు, టిటిడి సిబ్బంది ఇందుకోసం పనిచేశారు. ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.
The post అంగ‌రంగ‌ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీCM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

    ప్రధానమంత్రి నరేంద్రమోదీతో దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ దాదాపు 40 నిమిషాల

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్

Jogi Ramesh : నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను (Jogi Ramesh) పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్‌ను అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు… ఎక్సైజ్‌ ఆఫీస్‌కు తరలించారు. కల్తీమద్యం కేసులో జనార్దనరావు స్టేట్‌మెంట్‌

Ganta Srinivasa Rao: పురాతన విధానంలో సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతులుGanta Srinivasa Rao: పురాతన విధానంలో సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతులు

Ganta Srinivasa Rao : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఆలయం పైకప్పు మరమ్మతు పనులను పురాతన శాస్త్రీయ విధానంలో చేపట్టడం వల్ల మరో 200 ఏళ్లపాటు లీకేజీ సమస్యలు ఉత్పన్నం కావని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao)