hyderabadupdates.com movies కె ర్యాంప్ లక్ష్యం చిన్నదేం కాదు

కె ర్యాంప్ లక్ష్యం చిన్నదేం కాదు

దీపావళిని టార్గెట్ చేసి గత ఏడాది క తరహాలో ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్న కిరణ్ అబ్బవరం ఈసారి కె ర్యాంప్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ట్రైలర్, పాటలు యూత్ లో అంచనాలు పెంచాయి. పబ్లిసిటీ పరంగా నిర్మాత రాజేష్ దండా చేయాల్సిందంతా చేస్తున్నారు. హీరోతో పాటు సీనియర్ నటులు నరేష్ చాలా యాక్టివ్ గా పబ్లిసిటీలో పాల్గొంటూ సినిమా గురించి గొప్పగా చెబుతున్నారు. అయితే పండక్కు పోటీ తీవ్రంగా ఉంది. ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్, సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా, ధృవ్ విక్రమ్ బైసన్, ప్రియదర్శి మిత్ర మండలి, రష్మిక మందన్న తమ్మ ఉన్నాయి. దేనికవే విభిన్నమైన జానర్లు.

ఇంత కాంపిటీషన్ మధ్య కె ర్యాంప్ పెట్టుకున్న టార్గెట్ చిన్నదేం కాదు. ఇండియా వరకు చూసుకుంటే సుమారు ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలో దిగుతున్నట్టు ట్రేడ్ టాక్. అంటే గ్రాస్ పదహారు కోట్లు రావాలి. మాములుగా చూస్తే ఇదేమి భయపడే ఫిగర్ కాదు. కానీ పరిస్థితులు బాక్సాఫీస్ వద్ద అంత అనుకూలంగా లేవు. కంటెంట్ ఏ మాత్రం తేడా కొట్టినా సాయంత్రానికే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. లేదూ టాక్ బాగా వచ్చిందంటే లిటిల్ హార్ట్స్ లా ముప్పై కోట్లు దాటినా రన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కె రాంప్ లాంటి వాటికి యూత్ సపోర్ట్ చాలా అవసరం. వాళ్ళను మెప్పిస్తే చాలు.

తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదనే స్టేట్ మెంట్ తో వార్తల్లో నిలుస్తున్న కిరణ్ అబ్బవరం సాలిడ్ గా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. కె రాంప్ లో ఇప్పటికీ బూతుల మీద విమర్శలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందు షూట్ చేసిన లిప్ లాక్ సీన్స్ లో కోత వేశారని ఇన్ సైడ్ టాక్. ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారట. నిజమెంతో తెలియాలంటే వచ్చే వారం దాకా ఆగాలి. చేతిలో అయిదు సినిమాలతో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరంకు ఇప్పుడీ కె ర్యాంప్ సక్సెస్ అయితే మిగిలినవాటికి బిజినెస్ పరంగా పెద్ద బూస్ట్ దొరుకుతుంది.

Related Post

Aadi Pinishetty’s Thriller Drive Drops Gripping Trailer Ahead of Dec 12 ReleaseAadi Pinishetty’s Thriller Drive Drops Gripping Trailer Ahead of Dec 12 Release

The trailer of Drive, Aadi Pinishetty’s upcoming thriller, is out and has instantly captured attention with its intense, fast-paced storytelling. The film is gearing up for a grand theatrical release

ప‌వ‌న్ వ‌చ్చే వ‌ర‌కు గ్యారెంటీ లేదుప‌వ‌న్ వ‌చ్చే వ‌ర‌కు గ్యారెంటీ లేదు

ఒక ద‌శ‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్లో చివ‌రి చిత్రం అజ్ఞాతవాసినే అనుకున్నారంతా. ఆ సినిమా త‌ర్వాత ఇక‌పై సినీ రంగంలో కొన‌సాగ‌న‌ని.. రాజ‌కీయాల‌కే త‌న జీవితం అంకితం అన్న‌ట్లు మాట్లాడాడు ప‌వ‌న్. కానీ 2019 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యాక

ఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి వస్తుందిఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి వస్తుంది

బంగాళాఖాతంలో వాతావరణం ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. అరుదైన తుఫాను ‘సెన్యార్’ ముప్పు మన దేశానికి తప్పింది అనుకునేలోపే, మరో కొత్త ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. రాబోయే 12 గంటల్లో ఇది