hyderabadupdates.com Gallery PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ

PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ

PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ post thumbnail image

Narendra Modi : ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన నిరంతర శాంతి ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసించారు. గాజా నుంచి 20 మంది ఇజ్రాయెల్ బందీలు తిరిగి విడుదల కావడాన్ని స్వాగతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మోదీ తన స్పందన తెలియజేశారు.
PM Narendra Modi Key Comments
‘రెండేళ్లకు పైగా చెరలో ఉన్న బందీలందరూ విడుదల కావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల ధైర్య సాహసాలకు, అధ్యక్షుడు ట్రంప్ నిరంతర శాంతి యత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు దృఢ సంకల్పానికి దక్కిన గౌరవం ఇది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాం’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని తాజా సందేశం ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా రెండేళ్లుగా పైగా బందీలుగా ఉన్న 20 మందిని హమాస్ సోమవారం ఉదయం విడిచిపెట్టింది. తొలుత ఏడుగురు బందీలను, ఆ తర్వత మరో 13 మందిని అప్పగించింది. ఒప్పందంలో భాగంగా 48 మంది ఇజ్రాయెస్ వాసులను హమాస్ విడిచిపెట్టాల్సి ఉన్నప్పటికీ బందీల్లో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన హమాస్ త్వరలోనే తక్కిన 28 మంది మృతదేహాలను కూడా అప్పగించనుంది.
Also Read : Karur Stampede: సీబీఐ చేతికి కరూర్‌ తొక్కిసలాట కేసు
The post PM Narendra Modi : గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుRamachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్‌ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన

క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్క‌త్తి -2 మూవీపై లోకేష్ క‌న‌గ‌రాజ్ షాకింగ్ కామెంట్స్

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్పెష‌ల్ ఇమేజ్ క‌లిగిన ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్. త‌న స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. అందుకే త‌న‌తో ప‌ని చేయాల‌ని ప్ర‌తి న‌టి, న‌టుడు , టెక్నీషియ‌న్స్ ఆశిస్తారు. కోరుకుంటారు

వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌వెంగ‌మాంబ స‌న్నిధిలో ఈవో ర‌విచంద్ర‌

తిరుమల : టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి,