hyderabadupdates.com Gallery Aadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు

Aadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు

Aadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు post thumbnail image

 
 
ఆధార్‌ సంఖ్యను తెలపని ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరి పేర్లు, హోదా, ఆధార్, సెల్‌ఫోన్‌ నంబర్ల వివరాలు ఈ నెల 10వ తేదీకల్లా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని గత నెలలోనే ఈ శాఖ ఉత్తర్వులిచ్చింది. అయినా పలు శాఖల నుంచి స్పందన లేకపోవడంతో గడువును 17కి, ఆ తరువాత శనివారం (25) వరకూ రెండుసార్లు పొడిగించింది.
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను ‘సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ’ (ఐఎఫ్‌ఎంఐఎస్‌)లో తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేస్తేనే జీతాలు విడుదల చేయాలని ఆర్థికశాఖ గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ బాధ్యత ఆయా కార్యాలయాల్లో జీతాల డ్రాయింగ్‌ అధికారులదేనని హెచ్చరించింది. కానీ సరైన స్పందన లేకపోవడంతో వివరాలు ఇవ్వని వారికి ఈ నెల జీతం ఆపేయాలని తాజాగా ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగుల్లో శాశ్వత(పర్మనెంట్‌) కేటగిరీలో 5.21 లక్షల మంది, తాత్కాలిక కేటగిరీలో 4.93 లక్షల మంది పనిచేస్తున్నారు.
కొన్ని శాఖల్లో నిర్లక్ష్యం దారుణంగా ఉంది. వాటిలో ఒక్కరి వివరాలు కూడా నిర్దేశిత గడువులోగా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఉద్యోగుల సమగ్ర వివరాలు లేకపోవడంతో కొన్నిచోట్ల అక్రమంగా జీతాలు డ్రా చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా వారి పేరుతో వేతనాలు డ్రా చేస్తున్నారని, మరికొందరు అనధికారికంగా సుదీర్ఘ సెలవులో వెళ్లినా జీతాలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే చాలామంది వివరాలివ్వడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరు, మొబైల్‌ నంబర్, ఆధార్‌ నంబర్‌తో పోల్చి చూస్తే అసలు ఏ ఉద్యోగి ఏ శాఖలో ఉన్నారనే స్పష్టమైన వివరాలు అందుతాయని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ‘ఈనాడు’కు చెప్పారు. ఉద్యోగుల సమగ్ర వివరాలు ప్రభుత్వానికి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నెలా 10వ తేదీలోగా ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రతి ఉద్యోగి వివరాలను తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేయాలని చెప్పినా చేయడం లేదని ఆయన తెలిపారు.
The post Aadhaar Card: నో ఆధార్‌ నో శాలరీ – ఖజానా డైరెక్టరేట్‌కు ఆర్థికశాఖ ఆదేశాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగంప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగం

ఢిల్లీ : ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు భాగం అని ఆ విష‌యం గుర్తించాల‌న్నారు ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్. గ్రాడ్యుయేట్లు మూడు ప్రధాన బాధ్యతలను నిలబెట్టు కోవాలని కోరారు. సత్యాన్ని అన్వేషించడంలో మేధోపరమైన నిజాయితీ, అసమానతలను తగ్గించడానికి సామాజిక సమ్మిళితం, జాతీయ

చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్చెల‌రేగిన బ్యాట‌ర్లు ఇండియా భారీ స్కోర్

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన‌ ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. రికార్డ్ బ్రేక్ చేసింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి

భట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడుభట్టి యాక్టింగ్ ముందు కమల్ హాసన్ పనికిరాడు

హైద‌రాబాద్ : డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల కార్డు పట్టుకుని ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని భట్టి విక్రమార్క చెప్పాడ‌ని, ఇప్పుడు వాటి ఊసెత్త‌డం లేద‌న్నారు. ఇప్పుడు