hyderabadupdates.com Gallery AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం post thumbnail image

 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేబినెట్‌ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ రాష్ట్ర ఆర్థిక పురోగతి, ఏఐ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్‌ఐపీబీ మీటింగ్‌లో చర్చించిన నిర్ణయాలకూ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు స్పష్టం చేశారు. విజయనగరంలో పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుకు, ఓర్వకల్లులో రిలయన్స్‌ కన్జ్యూమర్‌ ప్రాజెక్టుకు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదించింది. శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 
గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సుకు అనేక పాలసీలు ఇచ్చామని కొలుసు పార్థసారథి తెలిపారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రూ.1.17లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సుమారు 70 వేల ఉద్యోగాలు వచ్చేలా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంటు, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
తోటపల్లి బ్యారేజి నుంచి 24 ఎంసీఎం నీటిని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. దీనితో పాటు ఎవాపరేషన్ లాసెస్‌కూ నీటిని కేటాయించినట్లు తెలిపారు. రిలయన్స్ కన్సూమర్ ప్రాడెక్ట్‌‌ల కింద కర్నూలు జిల్లాలో రూ.758 కోట్లతో ప్యాక్టరీ నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. టూరిజం పాలసీ ఒక గేమ్ ఛేంజర్ అందుకే దానిపై కేబినెట్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. దాని కోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సిల్స్ ఏర్పాటు చేయలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు
ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం
పర్యాటక అభివృద్ధి కోసం పలు పెట్టుబడులకు ఆమోదం
రూ.87 వేల కోట్లతో విశాఖలో 3 ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుకు కేబినెట్‌ అనుమతి
గూగుల్‌ డేటా సెంటర్‌కు 480 ఎకరాల కేటాయింపునకు ఆమోదం
ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ.1,200 కోట్లతో బీడీఎల్‌ ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీకి ఆమోదం
గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణకు కేబినెట్‌ ఆమోదం
పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం
13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చేందుకు ఆమోదం
ఆదాయాన్ని బట్టి పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజన
పంచాయతీ సెక్రెటరీలను.. పంచాయతీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా మార్చేందుకు ఆమోదం
అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్‌భవన్‌ నిర్మాణానికి ఆమోదం
హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై విచారణ జరుపుతున్నాం – మంత్రి సవిత
పెదనందిపాడు మండలంలోని అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సవిత పరామర్శించారు. విషయం తెలియగానే అధికారులు అప్రమత్తమై విద్యార్థులకు సత్వరమే వైద్యం అందించే ఏర్పాట్లు చేశారన్నారు. 17 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారని, పెదనందిపాడులో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారని వివరించారు. జ్వరంతో బాధపడుతున్న 16 మందిని జీజీహెచ్‌కు తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. హాస్టల్లో సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. రాత్రి సమయంలో వసతి గృహంలో ఉండాల్సిన వార్డెన్ లేరని.. అయినా సిబ్బంది స్పందించారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు.
The post AP Cabinet: రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని,