hyderabadupdates.com Gallery Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు

Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు post thumbnail image

 
 
డబుల్‌ పాన్‌ కార్డు కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్‌ నేత ఆజంఖాన్‌, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కోర్టు దోషులుగా తేల్చింది. అబ్దుల్లా ఆజం అసలు పుట్టిన తేదీ 1993 జనవరి 1వ తేదీ కాగా, ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వయసు అడ్డంకిగా మారింది. దీంతో అప్పటికే ఉన్న పాన్‌ కార్డును పక్కనపెట్టి… 1990 సెప్టెంబరు 30న జన్మించినట్లు తప్పుడు పత్రాలు చూపి మరో పాన్‌ కార్డు తీసుకున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన గెలుపొందారు. దీనిపై బీజేపీ నేత ఆకాశ్‌ సక్సేనా 2019లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్దుల్లా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు పాన్‌ నంబర్‌ ఇచ్చారని.. ఆజంఖానే తన కొడుకును ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయించేందుకు కుట్ర చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక 77 ఏళ్ల ఆజంఖాన్‌పై భూకబ్జా, అవినీతి, మోసం, మేకల దొంగతనం వంటి మొత్తం 84 కేసులున్నాయి.
The post Azam Khan: ఎస్పీ నేత ఆజంఖాన్‌కు ఏడేళ్ల జైలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలుRabri Devi: కుమారుల పోటీపై రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

Rabri Devi : బీహార్‌లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇంతలో ఆర్జేడీ చీఫ్‌ లాలూ భార్య రబ్రీదేవి (Rabri Devi) తన కుమారుల పోటీపై వ్యాఖ్యానించారు. తన కుమారుడు, జనశక్తి జనతాదళ్ (జేజేడీ)అధినేత తేజ్ ప్రతాప్

YS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలుYS Jagan: వైఎస్‌ జగన్‌ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు

  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌

“Chandrababu Sparks Buzz with Fresh Mining Initiative”“Chandrababu Sparks Buzz with Fresh Mining Initiative”

Chief Minister Chandrababu Naidu directed officials to formulate a policy on the issue of allocations in mining leases for Vadderas. He said that proposals should be prepared to discuss the issue of providing 15 percent