hyderabadupdates.com Gallery Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు

Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు

Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు post thumbnail image

Cabinet Sub Committee : సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉపసంఘం (Cabinet Sub Committee) శనివారం సమావేశమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రుల స్ధాయిలో తొలిసారి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొబ్బరాజు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతోపాటు పెండింగ్‌ డీఏలు చెల్లింపులు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
Cabinet Sub Committee Key Discussion
చర్చలు అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ… ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. నాలుగు డీఏలు చెల్లించాలని కోరతామని… అవి ఈరోజు కాకపోయినా దశల వారీగా అయినా చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చే హెల్త్ కార్డులు ఆసుపత్రుల్లో సక్రమ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై నేటి భేటీలో ఓ రూట్ మ్యాప్ వస్తుందని ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
అమీన్ పీర్ దర్గా ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి (CM Chandrababu) అహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉర్సు మహోత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఆయనతో సీఎం కాసేపు ముచ్చటించారు. ఉర్సు మహోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఉర్సు మహోత్సవాలకు సహకారం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.
Also Read : Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన
The post Cabinet Sub Committee: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం కీలక చర్చలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి !Car Accident: పెళ్లి బృందంపై దూసుకెళ్లిన కారు ! నలుగురు మృతి !

    బీహార్‌ లోని బెట్టియా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా-బాగా ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక కారు వివాహ అతిథుల బృందంపైకి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ దుర్ఘటనలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివాహ

Donald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షంDonald Trump: ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసల వర్షం

Donald Trump : భారత ప్రధాని నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. త్వరలో భారత్‌తో వాణిజ్య చర్చలకు సిద్ధమవుతున్న ట్రంప్‌… దక్షిణకొరియా వేదికగా ట్రంప్ (Donald Trump)… మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.