hyderabadupdates.com Gallery Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు post thumbnail image

 
 
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వివరాలు… సుధాకర్‌ యాదవ్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా గత నెల 10 ఉదయం 7.30 గంటలకు ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. తాను ముంబై సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌవర్‌ శుక్లానంటూ అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.
 
సుధాకర్‌ యాదవ్‌కు చెందిన సిమ్‌కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతాలను వినియోగించిన కొందరు భారీ స్థాయిలో మనీ లాండరింగ్‌ చేసినట్లు గుర్తించామని, మొత్తం 17 కేసులు నమోదయ్యాయని అగంతకుడు చెప్పాడు. ముంబైలోని బాంద్రాలో కొనుగోలు చేసిన సిమ్‌ను వినియోగించారని చెప్పగా సుధాకర్‌ యాదవ్‌ తొలుత పట్టించుకోలేదు. కొంతసేపటికి వాట్సాప్‌ వీడియో కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు దర్యాప్తు అధికారి విక్రమ్‌నంటూ మాట్లాడాడు. ఘరానా నేరగాడు సదాకత్‌ ఖాన్‌ ఫొటో, నకిలీ అరెస్టు వారెంట్, సీబీఐ పేరుతో ఉన్న ఉత్తర్వులు చూపించాడు. దీంతో సుధాకర్‌ ఆందోళనకు గురయ్యారు.
 
 
సుధాకర్‌ యాదవ్‌ పేరుతో కెనరా బ్యాంకులో ఉన్న ఖాతాలోకి రూ.3 కోట్లు డిపాజిట్‌ అయ్యాయని, దాని వివరాలు చెప్పే వరకు డిజిటల్‌ అరెస్టు చేస్తున్నామని సైబర్‌ నేరగాళ్లు బెదిరించారు. దీంతో తీవ్రంగా భయపడిన సుధాకర్‌ యాదవ్‌ తన నిర్దోత్వం నిరూపించుకోవడానికి సిద్ధయ్యాడు. అయితే తన అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లవద్దని, ఎవరితోనూ ఈ విషయం చెప్పవద్దని నేరగాళ్లు షరతు విధించారు. నిర్దోత్వం నిరూపించుకోవాలంటే తాము సూచించిన ఖాతాల్లోని నిర్ణీత మొత్తం బదిలీ చేయాలని, కేసు ముగిసిన తర్వాత ఆ మొత్తం రిఫండ్‌ చేస్తామని నమ్మబలికారు. దీంతో సుధాకర్‌ యాదవ్‌ గత నెల 10–15 తేదీల మధ్య తొమ్మిది విడతల్లో సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాల్లోకి రూ.1.07 కోట్లు జమ చేశారు. అయినప్పటికీ తగ్గని సైబర్‌ నేరగాళ్లు మరో రూ.60 లక్షలు డిమాండ్‌ చేశారు. ఆ మొత్తం చెల్లిస్తేనే కోర్టు నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇస్తామనడంతో ఆయన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు విడతల్లో అరెస్టు
ప్రత్యేక పోలీసు బృందం రంగంలోకి దిగి సుధాకర్‌ డబ్బు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాలతోపాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లింది. నిందితులను పోలీసులు గుర్తించి మూడు విడతల్లో అరెస్టు చేశారు. వీరిలో బ్యాంకు ఖాతాలు అందించిన వాళ్లు, ఖాతాలు తెరవడానికి, నగదు విత్‌డ్రా చేసుకోవడానికి సహకరించిన వాళ్లు ఉన్నారు. నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌కు చెందిన సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్‌ మేనేజర్‌ హిమాన్షు సింగ్, లక్నోకు చెందిన వ్యాపారి రమేష్‌ కుమార్, ప్రైవేట్‌ ఉద్యోగి అభిõÙక్‌ పాండే, విజయవాడకు చెందిన సమీప బంధువులు కోట శ్రీ సుదీప్, కోట శ్రీనివాస్, ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌కు చెందిన ఎస్‌ బ్యాంక్‌ కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌ ప్రశాంత్‌ కుమార్, మీరట్‌కు చెందిన వ్యాపారి దీపక్‌ గెహ్లాట్, న్యూ ఢిల్లీలోని జైత్‌పూర్‌కు చెందిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ డిప్యూటీ మేనేజర్‌ నీరజ్‌ ఉన్నారు.
The post Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌

DGP Shivadhar Reddy : మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్‌ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బండి ప్రకాశ్‌

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.