భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము… దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాతో భారత్ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్యరంగం, ఫార్మా రంగాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాల(ఎంఓయూలు)పై సంతకాలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రోజుల బోట్స్‌వానా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆ దేశ అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకోతో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌కు మరో 8 చీతాలను అప్పగించనున్నట్లు గిడియోన్ అధికారికంగా ప్రకటించారు.
2026తో బోట్స్‌వానా, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు 60వ ఏటా అడుగుపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో తన పర్యటన ఓ మైలురాయిగా నిలిచిపోతుందని ముర్ము పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి బోట్స్‌వానాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
సీఏ పాసయిన వీధి వ్యాపారి కొడుకు
రేకుల ఇల్లు.. వర్షం పడితే ఇంట్లో నీళ్లు.. వీధి వీధి తిరుగుతూ దుస్తుల విక్రయం.. చాలీచాలనీ ఆదాయం.. ఇదీ పశ్చిమ బెంగాల్ సీతారామ్‌పుర్‌కు చెందిన దుర్గేశ్ ప్రసాద్ దుస్థితి. పేదరికం వెక్కిరిస్తున్నా.. అతడి ముగ్గురు పిల్లలు మాత్రం రత్నాలు! తండ్రి కష్టాలను కళ్లారా చూసిన పెద్ద కుమారుడు ఆదర్శ్ ప్రసాద్.. చదువుల్లో రాణించి ఇటీవల సీఏ పాస్ కావడం విశేషం. దీంతో తమ కష్టాలు గట్టెక్కినట్లేనని దుర్గేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదర్శ్ మొదటి నుంచి చురుకైన విద్యార్థి. అతడి ప్రతిభను గమనించి ఉపాధ్యాయులు ఉచితంగానే ట్యూషన్ చెప్పేవారు. తన కుమారుడి చదువులకు ఏ లోటూ లేకుండా దుర్గేశ్ కష్టపడ్డారు. సీఏ ప్రిపరేషన్ సమయంలో దాతలూ అండగా నిలిచారు. వారిని ఆదర్శ్ నిరాశపర్చలేదు. ఎన్ని ఇక్కట్లు ఎదురైనప్పటికీ.. నాన్న తన వెన్నంటే ఉన్నారని గుర్తుచేసుకున్నాడు. దుర్గేశ్ మిగతా ఇద్దరు పిల్లలూ కోల్‌కతాలో అకౌంటెన్సీ చదువుతుండటం గమనార్హం.
The post Droupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Droupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందం
Categories: