hyderabadupdates.com Gallery Ex MLC Kavitha: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్

Ex MLC Kavitha: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్

Ex MLC Kavitha: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ post thumbnail image

 
 
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడంతోపాటు మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ ముట్టడికి కల్వకుంట్ల కవితతోపాటు ఆ సంస్థ నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వైపులా తోపులాట చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కల్వకుంట్ల కవితతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. అంతకుముందు జాగృతి అధ్యక్షురాలు కవిత ఆటోలో సింగరేణి భవన్‌కు చేరుకున్నారు.
 
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత… తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. అందుకోసం జనం బాట కార్యక్రమాన్ని ఆమె ఎంచుకున్నారు. నవంబర్ 17వ తేదీ సోమవారం… సత్తుపల్లిలోని సింగరేణి ఉపరితల బొగ్గు గనులను సందర్శించారు ఈ సంస్థలో డిపెండింగ్ ఉద్యోగాలనూ కాపాడుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి 54 మందిని ఎంపిక చేస్తే… ముగ్గురిని మాత్రమే తీసుకుని మిగతా 51 మందిని రద్దు చేశారని విమర్శించారు.
సింగరేణి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్థ కార్మికులపై మాట్లాడడం లేదని విమర్శించారు. సింగరేణిలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని.. వేజ్ బోర్డు ప్రకారం వేతనాలు అందజేయాలని.. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల, కార్మికుల పిల్లలకు పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 19వ తేదీన జాగృతి, హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం విదితమే. కవిత ప్రకటన నేపథ్యంలో బుధవారం ఉదయం సింగరేణి భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
The post Ex MLC Kavitha: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్KCR: మాగంటి సునీతకి బీఫాం అందజేసిన కేసీఆర్

KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం బీఫాం అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల చెక్కును అందజేశారు గులాబీ బాస్. ఈరోజు ఎర్రవల్లిలోని కేసీఆర్

Upendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలుUpendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్‌ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Upendra Dwivedi : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న ఘటనలను ఉద్దేశ్యించి భారత ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాత సమస్యలు పరిష్కరించుకునే లోగా కొత్తవి ఎదురవుతున్నాయని చెప్పారు.

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలుTrishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

    భారత త్రివిధ దళాలు సంయుక్తంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఎక్సర్‌సైజ్‌ త్రిశూల్‌ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌ లోని సౌరాష్ట్ర సముద్ర తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు గంటపాటు