hyderabadupdates.com Gallery Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !

Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య !

Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య ! post thumbnail image

Family Suicide : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు (Family Suicide). ఆలమూరు మండలం చిలకలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఎస్సై నరేశ్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో పావులూరి కామరాజు (35), అభిరామ్‌ (10), గౌతమ్‌ (7) విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. కామరాజు గతంలో వాలంటీర్‌గా పనిచేశారు. 2020లో ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి కామరాజు ఉంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Family Suicide – మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పండి
‘ఆడవాళ్లంతా తాగుబోతులు’ అంటూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ తీవ్రంగా ఖండించారు. బ్రహ్మనాయుడి వ్యాఖ్యలపై మీడియాలో దుమారం రేగడంతో ఆమె స్పందించారు. మహిళలను అవమానపరుస్తూ చేసిన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయనకు మహిళల పట్ల ఉన్న చులకనభావం అర్థమవుతోందన్నారు. మహిళలను అగౌరవపరిచినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని, అలా చేయకుంటే కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు.
Also Read : Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌
The post Family Suicide: కోనసీమ జిల్లాలో విషాదం! ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Chirag Paswan: మాకు నవంబర్‌ 14న దీపావళి పండుగ – చిరాగ్‌ పాసవాన్‌Chirag Paswan: మాకు నవంబర్‌ 14న దీపావళి పండుగ – చిరాగ్‌ పాసవాన్‌

    బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడిగా ఉంది. ఈ తరుణంలో లోక్‌ జన్‌శక్తి పార్టీ (రాంవిలాస్‌) చీఫ్ చిరాగ్ పాసవాన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నవంబర్ 14న దీపావళి చేసుకుంటామని మీడియాతో

Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్Nara Lokesh: గూగుల్ పై తమిళనాడులో జరుగుతున్న రచ్చపై స్పందించిన మంత్రి లోకేష్

    గూగుల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ కంపెనీ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ వైజాగ్‌లో డేటా

Minister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనMinister Nara Lokesh: ఈ నెల 19 నుండి మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన

Nara Lokesh : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈనెల 19 నుంచి 24 వరకు అంటే ఆరు రోజుల పాటు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటిస్తారు. ఈ మేరకు మంత్రి ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్