hyderabadupdates.com Gallery Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్‌

Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్‌

Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్‌ post thumbnail image

 
 
వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. వెంకట్‌రెడ్డిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీశ్‌కుమార్‌ ఈనెల 14న తాడిపత్రి సమీపంలో రైల్వేట్రాక్‌ పక్కన హత్యకు గురయ్యారు. దీనిపై ఏపీ పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు సీఎం చంద్రబాబుపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
 
కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత ప్రసాదనాయుడు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తాడిపత్రి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా కూకట్‌పల్లిలోని మెరీనా స్కైస్‌ అపార్ట్‌మెంట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేశారు.
 
కేసు ఏమిటంటే ?
టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సీఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణంపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు. తాడిపత్రి రూరల్‌ పోలీసులు 352, 353(1)(2), 196(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వెంకటరెడ్డి అరెస్ట్‌ అక్రమం – మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు
దేశంలో ఎక్కడా లేని దుష్ట సాంప్రదాయానికి రాష్ట్రంలో కూటమి నాయకులు శ్రీకారం చుట్టారు. టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ అనుమానాస్పద మృతి కేసులో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్ట్‌ చేశారు. పోలీస్‌ శాఖలో సీఐ స్థాయి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణిస్తే త్వరితగతిన విచారణ చేసి ఆయనది హత్యో, ఆత్మహత్యో నిర్ధారించడంలో పోలీసులు విఫలమయ్యారు. టీడీపీ నాయకులు సతీష్‌ కుమార్‌ది హత్య అని ప్రచారం చేస్తుంటే ఏ ఆధారాలతో చెబుతున్నారని టీడీపీని ప్రశ్నించినందుకు వెంకటరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు. సతీష్‌ కుమార్‌ చనిపోయాడని తెలిసిన వెంటనే ఆయన భార్య దగ్గర ఫోన్‌ స్వాధీనం చేసుకోవడం, మీడియాతో మాట్లాడకుండా వారి కుటుంబాన్ని నిలువరించడం వంటి వాటిపై ప్రభుత్వాన్ని కారుమూరి నిలదీశాడు.
 
The post Karumuru Venkat Reddy: వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడుCM Nitish Kumar: మొదటి సారి మీడియా మందుకు నితీష్ కుమార్ వారసుడు

    బిహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్డీయే భాగస్వామి, జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీష్ కుమార్‌. అయితే, సాక్షాత్తూ సీఎం తనయుడైనప్పటికీ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండే నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిషాంత్

చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్చేనేత‌న్న‌ల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

అమరావతి : నేతన్నలకు రాష్ట్ర స‌ర్కార్ తీపి కబురు చెప్పంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత త్రిఫ్గ్ ఫండ్ నిధులను జారీచేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్ర‌క‌టించారు. చేనేత సహకార సంఘాల బ్యాంకు

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !

Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది (Road Accident). చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర