hyderabadupdates.com Gallery PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ

PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ post thumbnail image

 
 
ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించనున్న జీ-20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 21-23వ తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ఇండియా- బ్రెజిల్- దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) నేతల సమావేశంలోనూ పాల్గొననున్నట్లు తెలిపింది.
 
‘‘20వ జీ-20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు. వరుసగా నాలుగోసారి ఓ గ్లోబల్ సౌత్‌ దేశంలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశం ఇది. సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని ప్రసంగించనున్నారు. సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి, వాణిజ్యం; వాతావరణ మార్పులు, ఆహార వ్యవస్థలు; అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు అంశాలపై మాట్లాడనున్నారు. వివిధ దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు’’ అని విదేశాంగశాఖ వెల్లడించింది.
 
ఈ జీ-20 సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కాబోరని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో మైనారిటీలైన శ్వేతజాతి రైతులను చూస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అంతకుముందు మయామిలో చేసిన ఓ ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్‌ నుంచి తొలగించాలని కూడా డిమాండ్‌ చేశారు.
The post PM Narendra Modi: జీ20 సదస్సులో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు ప్రధాని మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty ResponseSonakshi Sinha Breaks Silence on Pregnancy Rumours with A Witty Response

Bollywood actress Sonakshi Sinha has finally addressed the persistent rumours surrounding her pregnancy in a humorous way. The actress, who recently attended an event with her husband Zaheer Iqbal, found

Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌

    భారత్-ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీది కీలక పాత్ర అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్‌.. బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య