hyderabadupdates.com Gallery Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ? post thumbnail image

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని, ఆయన అందించే దాతృత్వ సేవలకు, ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న వివరాలకు పొంతనే లేదని ట్రావన్‌కోర్‌ దేవస్థానం మండలి (టీడీబీ) విజిలెన్స్‌ విభాగం తన నివేదికలో పేర్కొంది. 2017-2025 మధ్య ఉన్నికృష్ణన్‌ సమర్పించిన ఆదాయపు పన్ను మదింపు పత్రాలను పరిశీలించి రూపొందించిన నివేదికను విజిలెన్స్‌ విభాగం కేరళ హైకోర్టుకు (Kerala High Court) అందజేసింది. ఈ నివేదిక ఆధారంగానే దర్యాప్తు కోసం సిట్‌ను న్యాయస్థానం నియమించింది. ‘2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉన్నికృష్ణన్‌ బ్యాంకు ఖాతాలో రూ.10.85 లక్షల నగదు జమ అయ్యింది. ఈ మొత్తాన్ని కామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ సామాజిక సేవ కేటగిరీలో కేటాయించింది.
Sabarimala Gold
గర్భగుడి తలుపునకు మరమ్మతులు, బంగారు తాపడం పనులు చేయిస్తానని ఉన్నికృష్ణన్‌ ముందుకొచ్చారు. వాస్తవానికి ఈ ఖర్చుకు బళ్లారి వ్యాపారి గోవర్దన్‌ నిధులిచ్చారు. ద్వారబంధం కూడా తానే ఇచ్చానని ఉన్నికృష్ణన్‌ చెప్పుకున్నారు. అయితే, బెంగళూరు వ్యాపారి అజికుమార్‌ వాస్తవ దాత. ఈ ఏడాది వివిధ పూజలకు, అలంకరణలతో పాటు అన్నదాన మండపానికి రూ.10లక్షలు, అన్నదానానికి రూ.6లక్షలు ఉన్నికృష్ణన్‌ విరాళంగా అందించారు. 2017లో కూడా రూ.8.20 లక్షలతో పాటు 17 టన్నుల బియ్యం, 30 టన్నుల కూరగాయలు దేవాలయానికి అందజేశార’ని విజిలెన్స్‌ నివేదిక పేర్కొంది.
ద్వారపాలకుల ప్రతిమలతో పాటు బంగారు రేకులకు మరమ్మతులు, స్వర్ణ తాపడం పనులను 2019లో ఉన్నికృష్ణన్‌కు అప్పగించడం వెనుక దేవస్థానం అధికారులు, డిప్యూటీ కమిషనర్, టీడీబీ సభ్యుల హస్తం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. దీంతో ఉన్నికృష్ణన్‌ను తొలి ముద్దాయిగా, టీడీబీ అధికారులు పలువురిని నిందితులుగా సిట్‌ చేర్చింది. అయితే, పాలకమండలి ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని 2019లో టీడీబీ అధ్యక్షుడిగా ఉన్న సీపీఎం నేత ఎ.పద్మకుమార్‌ తెలిపారు. నేరాన్ని తనపై మోపే యత్నాలు జరుగుతున్నాయని, దర్యాప్తులో సత్యమేమిటో త్వరలోనే వెల్లడవుతుందని పేర్కొన్నారు. కాగా, కేరళలోని అన్ని హిందూ ఆలయాల ఆస్తులు, వాటి నిర్వహణపై తనిఖీలు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ డిమాండ్‌ చేసింది.
Also Read : CM Mamata Banerjee: భూటాన్‌ వల్లే బెంగాల్‌ లో వరదలు – మమతా బెనర్జీ
The post Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World RecordsVijayawada Utsav’s Carnival Earned A place In Guinness Book of World Records

The carnival organized on Mahatma Gandhi Road as part of Vijayawada Utsav-2025 has earned a place in the Guinness Book of World Records. To this end, the representatives of Vibrant

ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌ISRO Chief Narayanan: అంతరిక్షానికి 80వేల కేజీలను మోసుకెళ్లేలా రాకెట్లు – ఇస్రో చీఫ్‌

ISRO Chief Narayanan : అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్‌ వెల్లడించారు. వాటిలో 80వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారుచేయడం, 2026లో వ్యోమమిత్ర అనే రోబోను అంతరిక్షంలోకి

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

    బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా