hyderabadupdates.com Gallery Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌

Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌ post thumbnail image

 
 
బీహార్‌ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితమే పార్టీ నుంచి బహిష్కృతుడైన తేజ్ ప్రతాప్ పలు అంశాలలో వివాస్పదునిగా వార్తల్లో కనిపిస్తున్నారు. జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి, మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్విపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ… ‘ఆర్జేడీ పార్టీలోకి తిరిగి వెళ్లేకంటే చావడమే నయం. నాకు అధికార దాహం లేదు. మానవీయ సూత్రాలు, ఆత్మగౌరవం అత్యున్నతమైనవి’ అని తేజ్ ప్రతాప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజల కోసం పనిచేయడమే తనకు సంబంధించిన పెద్ద విషయం అని, నిజాయితీగా అదే పని చేస్తానని, అప్పుడే ప్రజలు తనను ప్రేమిస్తారు.. నమ్ముతారని తేజ్‌ ప్రతాప్‌ పేర్కొన్నారు. ఆయన 2015లో ఎన్నికల అరంగేట్రం చేసిన మహువా స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుండే ఈ నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నానని తేజ్‌ ప్రతాప్‌ పేర్కొన్నారు. తన తమ్మునికి నమ్మకస్థుడైన సిట్టింగ్ ఆర్జేడీ శాసనసభ్యుడు ముఖేష్ రౌషన్‌ను తాను పోటీదారుగా భావించడం లేదన్నారు.
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ తాము చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదని, కానీ వారి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు.ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేయడం తనకు నచ్చలేదన్నారు. పలు రకాల ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణమని, కానీ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి మాత్రమే అధికారాన్ని చేజిక్కించకుంటాడని తేజ్‌ ప్రతాప్‌ అన్నారు.
The post Tej Pratap Yadav: చావనైనా చస్తాను కాని మళ్ళీ ఆర్జేడీలో చేరను – తేజ్ ప్రతాప్ యాదవ్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌Vande Bharat 4.0: త్వరలో వందేభారత్‌ 4.0 – కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Vande Bharat : భారతదేశపు సెమీ-హై-స్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్‌ రానుంది. వందేభారత్‌ 4.0 (Vande Bharat)ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దాని రూపకల్పన ఉంటుందని వెల్లడించారు.

Wedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహంWedding Tragedy: కూతురు పెళ్లికి వేసిన పందిరి కిందే తండ్రి మృతదేహం

    పచ్చని పెళ్లి పందిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురిని మెట్టినింటికి పంపాల్సిన ఓ తండ్రి కాటికి చేరాడు. కూతురి పెళ్లి కోసం సరుకులు తీసుకురావడానికి వెళ్లిన ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీనితో కూతురు పెళ్ళి కోసం

Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్Cabinet Meeting: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం – కేంద్ర కేబినెట్

    ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7