దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ ప్రమాదంలో మృతిచెందిన పైలట్, వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామమైన కాంగ్రాలోని పాటియాల్కర్ ప్రాంతానికి తరలించారు. ఆయన భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్.. ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో ఆమె కన్నీటిపర్యంతమవుతూనే భర్తకు సెల్యూట్ చేశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో సైన్యం గౌరవ వందనాల నడుమ ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతిచెందిన పైలట్, వింగ్ కమాండర్ భార్య అఫ్షాన్ కూడా అదే విభాగానికి చెందిన వారే. వీరికి ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. భర్త అకాల మృతితో ఆమె విషాదంలో మునిగిపోయారు. కన్నీళ్లను దిగమింగుకుంటూనే భర్త మృతదేహానికి చివరిసారి సెల్యూట్ చేశారు. అయినప్పటికీ ఆమె రోదిస్తుండగానే సహచరులు అక్కడి నుంచి తీసుకెళ్లారు.
పైలట్ కమాండర్ సియాల్ మృతిపట్ల భారత వైమానిక దళం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి ప్రొఫెషనల్ అయిన వింగ్ కమాండర్ సియాల్.. అంకితభావం, నిబద్ధత, అసాధారణ నైపుణ్యం, అలుపెరుగని దృఢ సంకల్పంతో దేశానికి సేవ చేశారని కొనియాడింది. ‘సేవకు అంకితమైన ఆయన జీవితం.. నేడు ఆయనకు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిత్వాన్ని తెచ్చిపెట్టింది. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబానికి ఐఏఎఫ్ సంఘీభావంగా నిలుస్తుంది’ అని పేర్కొంది. ఈ కార్యక్రమానికి ఐఏఎఫ్ సిబ్బంది సహా యూఏఈ అధికారులు, భారత రాయబార కార్యాలయ అధికారులు, సహచరులు తదితరులు హాజరయ్యారు. వింగ్ కమాండర్ నమాన్ష్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్ ఓ ధైర్య పుత్రుడిని కోల్పోయిందని ఆయన అన్నారు.
ఫైలట్ నమాన్ష్ దూకుదామని ప్రయత్నించాడు కానీ?
దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో తేజస్ ఫైటర్ జెట్ కూలి వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే జెట్ ప్రమాదానికి గురవుతుందని ముందుగానే ఫైలట్ గ్రహించాడని అతను జెట్ నుంచి కిందకి దూకుదామని ప్రయత్నించాడని దర్యాప్తు బృందాలు తెలిపాయి. కానీ ఫైలట్ ఎందుకు జెట్ నుంచి దూకలేకపోయాడో అనే సంగతి విచారణ జరుపుతున్నామని తెలిపారు.
రెండు రోజుల క్రితం దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో తేజస్ జెట్ కూలి వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ మృతిచెందారు. అయితే ఆ ప్రమాద సమయంలో ఫైలట్ జెట్ నుంచి దూకి తప్పించుకొనే ప్రయత్నం చేశాడని దర్యాప్తు బృందాలు తెలిపాయి. కానీ ఆయన అలా చేయకపోవడానికి జెట్‌లో ఏదైనా సాంకేతిక కారణాలు తలెత్తి ఉండవచ్చని లేదా ఫైలట్ ఆరోగ్య పరిస్థితులైనా సహకరించకపోయి ఉండచ్చని దర్యాప్తు బృందాలు పేర్కొన్నాయి.
ఆ వివరాలు జెట్‌కు సంబంధించిన బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే తెలుస్తాయని ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారులు తెలిపారు. కాగా ఎయిర్ షో ప్రారంభానికి ముందు వింగ్ కమాండర్ సయీల్ కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సేత్, యూఏఈ భారత రాయభారి దీపక్ మిట్టల్ తో మాట్లాడుతున్న వీడియో వైరలవుతోంది. అందులో నిమాన్ష్ సరదాగా నవ్వుతూ అధికారులతో మాట్లాడుతున్నారు.
The post Wing Commander Namansh Syal: వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ కన్నీటి వీడ్కోలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Wing Commander Namansh Syal: వింగ్ కమాండర్ నమాన్ష్ సియాల్ కన్నీటి వీడ్కోలు
Categories: