hyderabadupdates.com Gallery అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం

అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం

అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం post thumbnail image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస గిరిపై కొలువై అధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఆయ‌న స‌తీమ‌ణి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు.
అనంతరం గోవింద నామ స్మరణలతో మారు మోగుతున్న గిరి శిఖరం పైకి భక్తులతో కలిసి మెట్ల మార్గాన నడుచుకుంటూ వెళ్ళి భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, తిరు కళ్యాణ మహోత్సవం తిలకించారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుల‌య్యారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ సమన్వయంతో ప్రకృతి మధ్యలో ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ఈ దేవాలయాన్ని ఎకో టెంపుల్ టూరిజం ప్రదేశంగా అభివృద్ధి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ శ్రీనివాసగిరి వేంకటేశ్వరుని ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని కోరుకోవడం జరిగిందన్నారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో సహచర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, అధికారులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
The post అంగ‌రంగ వైభ‌వోపేతం తిరు క‌ళ్యాణోత్స‌వం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

TTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపుTTD: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

  తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు కీలక మలుపు తిరిగింది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. వైవీ సుబ్బారెడ్డి సన్నిహితుడు చిన్నఅప్పన్న అరెస్టుతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు

రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాంరాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం

హైద‌రాబాద్ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026-2027 బడ్జెట్ లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఇతర వసతులపై డా.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు షాక్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం రోజు రోజుకు కొత్త మ‌లుపులు తిరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌త్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల‌ను విచారించింది.