hyderabadupdates.com Gallery అగ్ర వర్ణాల్లో పేదరికాన్ని రూపుమాపుతాం

అగ్ర వర్ణాల్లో పేదరికాన్ని రూపుమాపుతాం

అగ్ర వర్ణాల్లో పేదరికాన్ని రూపుమాపుతాం post thumbnail image

అమరావతి : ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్ర కులాల పేదలకు (ఈడబ్ల్యూఎస్ వర్గీయులు) కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని, వారి పేదరికాన్ని పారదోలేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తులు తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ యువతకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఒకే సముదాయంలో కమ్మ కార్పొరేషన్, పాలకమండలి సభ్యుల కార్యాలయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు స‌విత‌. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
గతంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక ఆదాయం కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. కొద్ది రోజుల కిందట ఎంఎస్ఎంఈ పార్కుల్లో వ్యాపార అవకాశాలపై మరో సదస్సు నిర్వహించామన్నారు. ఏయే రంగాల్లో ఆర్థిక వృద్ధి లభిస్తుందో వాటిపై ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు అవగాహన సదస్సులు కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈడబ్ల్యూఎస్ వర్గీయులకు గౌరవప్రద జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు స‌విత‌. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగా కల్పించి తీరుతామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల్లో ఏపీకి రూ.25 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ ఘనత అంతా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు.
The post అగ్ర వర్ణాల్లో పేదరికాన్ని రూపుమాపుతాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్Bhojpuri Singers: బిహార్ ఎన్నికల బరిలో పలువురు భోజ్‌పురీ సింగర్స్

Bhojpuri Singers : బిహార్‌ సంస్కృతి, సంప్రదాయాలకు భోజ్‌పురీ పాటలు (Bhojpuri Singers) పెట్టింది పేరు. అక్కడి ప్రజల్లోనూ వీటికి విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ‘జానపదం’ తనదైన ముద్ర వేసుకుంటోంది. అనేక మంది పాపులర్‌ గాయనీ

చెల‌రేగిన హైద‌రాబాద్ త‌ల‌వంచిన కోల్ క‌తాచెల‌రేగిన హైద‌రాబాద్ త‌ల‌వంచిన కోల్ క‌తా

కోల్ క‌తా : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఎట్ట‌కేల‌కు 2వ మ్యాచ్ లో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌

హైద‌రాబాద్ : ఓ వైపు అధికారాన్ని కోల్పోయినా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వాణిని వినిపిస్తూ వ‌స్తున్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కు కంట్లో న‌లుసు లాగా త‌యారైంది త‌న స్వంత, ముద్దుల