hyderabadupdates.com Gallery ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ

ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ

ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ post thumbnail image

ముంబై : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ అరుదైన ఘ‌న‌త సాధించారు. త‌ను మ‌రో వ్యాపార‌వేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండ‌గా గౌత‌మ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది, ఇది ప్రపంచ సంపద ర్యాంకింగ్‌లలో అంబానీని అధిగమించడానికి అతనికి సహాయ ప‌డేలా చేసిందని చెప్ప‌క త‌ప్ప‌దు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా ర్యాంకుల‌ను ప్ర‌క‌టించింది. తాజా డేటా ప్రకారం అదానీ అంబానీని వెన‌క్కి నెట్టివేసి ముందుకు వ‌చ్చారు. అత్యంత ధనవంతుడిగా అవతరించారు. శుక్రవారం విడుదల చేసిన ర్యాంకింగ్‌ల ప్రకారం అదానీ టాప్ లో నిలిచారు.
గౌతం ఇప్పుడు 92.6 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ వ్యాప్తంగా 19వ స్థానంలో ఉన్నారు. పోల్చి చూస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ 90.8 బిలియన్ డాలర్ల నికర సంపదతో 20వ స్థానంలో నిలిచారు. అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో ఈ ర్యాంకు చోటు చేసుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా స్టార్ లింక్ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎక్స్ చైర్మ‌న్ , ఎండీ ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆయన తర్వాత 286 బిలియన్ డాలర్లతో లారీ పేజ్ , 269 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ ఉన్నారు.
The post ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాంప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాం

అమరావతి : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 4.30

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సిస్కో స‌హ‌కారంతెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సిస్కో స‌హ‌కారం

దావోస్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స్కిల్ యూనివ‌ర్శిటీకి ప్ర‌ముఖ సంస్థ సిస్కో స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. దావోస్ వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సులో సంస్థ ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సంద‌ర్బంగా సిస్కోకు ధ‌న్య‌వాదాలు

నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌నూత‌న హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి సీజేఐ శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి