hyderabadupdates.com Gallery ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్

ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ post thumbnail image

యూఏఈ : త‌న ప‌ట్ల వివ‌క్ష కొన‌సాగుతోందంటూ తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాడు ప్ర‌ముఖ దిగ్గ‌జ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఉన్న‌ట్టుండి యూఏఈ వేదిక‌గా ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇందులో భాగంగా ఎతిహాద్ అరేనా వేదిక‌గా సంగీత క‌చేరి నిర్వ‌హించాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌న చ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. ఇక్క‌డ చేప‌ట్టిన క‌చేరి భ‌వ‌నం పూర్తిగా నిండి పోయింది. పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌రు కావ‌డం విశేషం. ఏకంగా 20 వేల మందికి పైగా పాల్గొన్నారు. రెహ‌మాన్ పాట‌ల‌ను ఆస్వాదించారు. దాదాపు నాలుగు గంట‌ల‌కు పైగా ఈ సంగీత క‌చేరి సాగింది. చిన్నారులు, పెద్ద‌లు, మ‌హిళ‌లు, వ‌య‌సు పైబ‌డిన వారు కూడా హాజ‌ర‌య్యారు. త‌న పాట‌ల‌ను ఆస్వాదించారు హాయిగా.
ఇక ఈ క‌చేరి ప్రారంభం అయిన వెంట‌నే ఏఆర్ రెహ‌మాన్ తొలుత త‌ను స్వ‌ర ప‌ర్చిన టాప్ సాంగ్స్ ను ఆలాపించారు. ప్ర‌ధానంగా దక్షిణాది పాట‌ల‌తో స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత సూప‌ర్ హిట్ హిందీ సాంగ్స్ ను పాడ‌డు. ఈ మద్రాస్ మొజార్ట్ ఈ కచేరీని మ‌ణిర‌త్నం తీసిన ఆయుత ఎళుత్తు చిత్రంలోని జన గణ మన పాడాడు. వందే మాత‌రం, మా తుఝే స‌లాం తో ముగించాడు. అంతే కాకుండా ఆస్కార్ అవార్డు పొందిన స్ల‌మ్ డాగ్ నుండి జై హో పాట‌ను ఆలాపించాడు. ఇదే క్ర‌మంలో జై హో సాంగ్ రెహ‌మాన్ ది కాద‌ని అది వేరే గాయ‌కుడు ఇచ్చాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇన్ని వివాదాలు, ఆరోప‌ణ‌ల తర్వాత రెహ‌మాన్ క‌చేరి స‌క్సెస్ కావ‌డం విశేషం.
The post ఏఆర్ రెహ‌మాన్ క‌చేరికి పోటెత్తిన ఫ్యాన్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌ ఎప్పుడంటే!బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌ ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం “బ్యాడ్ బాయ్ కార్తీక్” నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ చూసిన వెంటనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి పెరిగింది. ఇందులో నాగశౌర్య స్టైలిష్ లుక్‌తో, ఎనర్జీతో కనిపించి ఆకట్టుకున్నాడు. అతని బాడీ

Tirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభంTirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభం

Tirumala : తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం పరిశీలించింది.

జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావుజ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం : హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్టీవీతో పాటు ఇత‌ర ఛాన‌ల్స్ లో వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందించిన స‌ర్కార్ సిట్ ను ఏర్పాటు చేయ‌డాన్ని త‌ప్పు