hyderabadupdates.com movies ఒక్క విషయంలోనే భగత్ సింగ్ ఆందోళన

ఒక్క విషయంలోనే భగత్ సింగ్ ఆందోళన

దురంధర్ 2 రివెంజ్ ఏమైనా వాయిదా పడుతుందేమో, సోలో రిలీజ్ ఎంజాయ్ చేయొచ్చని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉదయం రణ్వీర్ సింగ్ బృందం షాక్ ఇచ్చింది. రేపు ట్రైలర్ లాంచ్ తో పాటు మార్చి 19 విడుదలలో ఎలాంటి మార్పు లేదని నొక్కి వక్కాణించడంతో ఉస్తాద్ భగత్ సోలో రిలీజ్ కు దారులు మూసుకున్నాయి. ఏపీ, తెలంగాణ వరకు పవన్ మూవీకి ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే లాంగ్ వీకెండ్ వేరే తెలుగు స్ట్రెయిట్ సినిమా లేదు కాబట్టి ఓపెనింగ్స్ తో పాటు భారీ వీకెండ్ క్యాష్ చేసుకోవచ్చు.

కానీ దురంధర్ 2 పోటీకి సంబంధించి ఒక్క విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవర్సీస్ లో దీని ప్రభావం ఉస్తాద్ మీద ఖచ్చితంగా ఉంటుంది. దురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మంచి ఊపు మీదున్నాయి. ఏపీ తెలంగాణలో చిక్కు లేదు కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఎఫెక్ట్ అయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు కనక పది రోజుల పాటు టికెట్ రేట్ల హైక్ తీసుకుంటే అది దురంధర్ 2కి మేలు చేస్తుందని ట్రేడ్ అభిప్రాయంపడుతోంది. ఇది పూర్తిగా కొట్టి పారేయలేని స్టేట్ మెంట్.

ఫ్యామిలీ ఆడియన్స్ దురంధర్ 2కి దూరంగా ఉండి ఉస్తాద్ భగత్ సింగ్ కి ఛాయిస్ గా పెట్టుకోవడమే ఫ్యాన్స్ సంతోష పడాల్సిన ముఖ్యమైన పాయింట్. బిజినెస్, స్క్రీన్ల విషయం పక్కనపెడితే పబ్లిక్ టాక్, రివ్యూలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్, మూవీ లవర్స్ దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది వీటి మీదే ఆధారపడి ఉంటుంది. టాక్సిక్ లేకపోవడం వల్ల ఉస్తాద్ కు చాలా సానుకూలతలు ఉండబోతున్న నేపథ్యంలో వాటిని రికార్డులుగా మార్చుకోవాల్సిన బాధ్యత దర్శకుడు హరీష్ శంకర్ మీద ఉంది.

హైప్ పరంగా చూసుకుంటే ఓజి రేంజ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సౌండ్ చేయడం లేదు కానీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఒక్కసారిగా అంచనాలు మారిపోతాయిని టీమ్ నమ్మకంగా ఉంది. తమన్ రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీన్ని దగ్గరుండి చూసుకుంటున్న హరీష్ శంకర్ వీలైనంత వరకు మీడియాకు అందుబాటులో ఉంటూ సినిమాను జనాలకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ దురంధర్ 2 రివెంజ్ టాక్ కనక ఏ కొంచెం అటుఇటు అయినా ఉస్తాద్ భగత్ సింగ్ ఊచకోతకు అన్ని చోట్ల దారులు తెరిచినట్టే.

Related Post

MM Keeravani’s Soulful Song Adds Emotional Depth to Upcoming Film PurushahaMM Keeravani’s Soulful Song Adds Emotional Depth to Upcoming Film Purushaha

Oscar-winning composer MM Keeravani once again proves his magic with the soulful song “Jaali Padedhevvadu” from the upcoming Telugu film Purushaha. The song has quickly caught attention for its emotional

Norwegian Fjords Cruise: A Scenic Shortcut to Europe’s Hidden CornersNorwegian Fjords Cruise: A Scenic Shortcut to Europe’s Hidden Corners

Discover the stunning Norwegian Fjords on a scenic cruise—your shortcut to Europe’s hidden corners with breathtaking views, cozy villages, and easy, unforgettable exploration. The post Norwegian Fjords Cruise: A Scenic