hyderabadupdates.com movies ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం, సీటులో మిగిలిన అస్థిపంజరం

ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం, సీటులో మిగిలిన అస్థిపంజరం

హైదరాబాద్-శామీర్‌పేట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు ‌పై ఘోర ప్రమాదం జరిగింది. హఠాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఎకో స్పోర్ట్ కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో తప్పించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కారులోనే డ్రైవర్ అగ్నికి ఆహుతయ్యాడు. కేవలం అతని అస్థిపంజరం మాత్రమే కనపడడంతో సంఘటన సంచలనం అయ్యింది.

ఈ ఘటన నేపథ్యంలో కొన్ని రకాల కార్లలో భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా డ్రైవర్ సీటు బెల్టు తొలగించుకోలేక చనిపోయిన ఘటనలే అధికంగా ఉన్నాయని నెటిజన్లు తమ తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో సీటు బెల్టు పెట్టుకోవడం మంచిదేనని, కానీ ఈ రకంగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఆ సీటు బెల్టే డ్రైవర్ల పాలిట యమపాశంగా మారుతోదని అంటున్నారు.

కారులో అగ్నిపమాదాలు జరిగిన సమయంలో సీటు బెల్ట్ కట్ చేసుకునేందుకు వీలుగా అవసరమైన టూల్ ను ప్రతి ఒక్కరు కార్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. కారు అద్దాలు పగలగొట్టేందుకు వీలుగా సుత్తి వంటి టూల్స్ కూడా ఉండాలని సలహా ఇస్తున్నారు.

Related Post

Nidhhi Agerwal on The Raja Saab: “Audiences Are Truly Enjoying It”Nidhhi Agerwal on The Raja Saab: “Audiences Are Truly Enjoying It”

The Sankranthi season has turned special for actress Nidhhi Agerwal, as The Raja Saab, starring Prabhas, continues its strong run at the box office and wins appreciation from family audiences

పెద్ద ముప్పు తెచ్చి పెట్టనున్న దురంధర్ 2పెద్ద ముప్పు తెచ్చి పెట్టనున్న దురంధర్ 2

నిన్నటిదాకా బాలీవుడ్ వర్గాల్లో వినిపించిన మాట దురంధర్ 2 విడుదల ముందు ప్రకటించినట్టు మార్చి 19 ఉండదని. కానీ ఇప్పుడు స్వరం మారిపోయింది. ఖచ్చితంగా అదే డేట్ కి వస్తున్నట్టు పలు వర్గాల ద్వారా టీమ్ కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్