hyderabadupdates.com Gallery కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్

కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్

కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్ post thumbnail image

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న కేంద్ర మంత్రి జేడీ కుమార స్వామిపై తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. త‌న గురించి లేని పోని కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. బెంగ‌ళూరులో ఇవాళ డీకే మీడియాతో మాట్లాడారు. త‌మ స‌ర్కార్ ప్ర‌జా పాల‌న సాగిస్తోంద‌ని చెప్పారు. సుదీర్ఘ కాలం పాటు రాజ‌కీయాలలో కొన‌సాగుతూ వ‌స్తున్నాన‌ని చెప్పారు. కుమారస్వామి కంటే నాకు రాజకీయాల్లో ఎక్కువ అనుభవం ఉందని అన్నారు డీకే శివ‌కుమార్. నేను ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ ఆయన కంటే నాకు పరిపాలనలో మెరుగైన అనుభవం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. నేను చాలా కాలం పాటు మంత్రిగా ఉన్నానని అన్నారు. పరిపాలన అంటే ఏమిటో, ఎలా పనిచేయాలో, ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో నాకు బాగా తెలుసంటూ స్ప‌ష్టం చేశారు.
అయితే ప‌దే ప‌దే నోరు పారేసుకుంటున్న కుమార స్వామికి తాను చెప్పేది ఒక్క‌టేన‌ని, ఇత‌రుల విష‌యాల‌లో జోక్యం చేసుకుంటే త‌న‌కే మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. తాను ఏమిటో, త‌న ప‌నితీరు ఏమిటో ఇప్ప‌టికే మీ పార్టీకి, ప్ర‌తిప‌క్షాల‌తో పాటు త‌మ పార్టీ వారికి కూడా తెలుస‌న్నారు. ఇవాళ కాక పోయినా ఏదో ఒక రోజు క‌ర్ణాట‌క‌కు ముఖ్య‌మంత్రి అయి తీరుతానంటూ ప్ర‌క‌టించారు. అప్ప‌టి వ‌ర‌కు కుమార స్వామి కాస్తాంత ఓపిక ప‌ట్టాలంటూ హిత‌వు ప‌లికారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా నేను పార్టీ కోసం పనిచేయాలి. గతంలో కూడా నేను అస్సాంకు వెళ్ళాను. నేను ఇప్పుడే ఏఐసీసీ పత్రికా ప్రకటన చూశాను, వారు నన్ను మళ్ళీ అస్సాంకు వెళ్లమని కోరుతున్నారు, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను అని చెప్పారు.
The post కుమార స్వామిపై భ‌గ్గుమ‌న్న డీకే శివ‌కుమార్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్DGP Shivadhar Reddy: కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్

DGP Shivadhar Reddy : నిజామాబాద్‌ లో కానిస్టేబుల్‌ను హతమార్చిన (Conistable Death) వాహనాల దొంగ రియాజ్‌ (24) పోలీసు కాల్పుల్లో మృతిచెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్‌… కానిస్టేబుల్‌ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం

చ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దుచ‌ట్ట స‌భ‌ల‌పై చుల‌క‌న భావం ఉండ‌కూడ‌దు

​అమరావతి : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర

పాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తుపాకిస్తాన్ బ‌హిష్క‌ర‌ణ‌పై ఐసీసీకి పూర్తి మ‌ద్ద‌తు

న్యూఢిల్లీ : బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా పార్ల‌మెంట్ లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంతో తాము ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేది లేదంటూ పాకిస్తాన్ ప్ర‌క‌టించ‌డంపై స్పందించారు. దీంతో ఐసీసీ వేటు వేసేందుకు