hyderabadupdates.com Gallery కూల్చివేత‌ల‌న్నీ హైడ్రాకు ఆపాదించ‌డం త‌గ‌దు

కూల్చివేత‌ల‌న్నీ హైడ్రాకు ఆపాదించ‌డం త‌గ‌దు

కూల్చివేత‌ల‌న్నీ హైడ్రాకు ఆపాదించ‌డం త‌గ‌దు post thumbnail image

హైద‌రాబాద్ : ఎక్క‌డ కూల్చివేత‌లు జ‌రిగినా తామే చేసిన‌ట్టు చూపించి దుష్ప్ర‌చారం చేయ‌డాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ప్ర‌తినిధులు గుర్తించాల‌ని హైడ్రా కోరింది. అవ‌గాహ‌న లేకుండా సోష‌ల్ మీడియా ప్ర‌సారం చేస్తున్న వార్త‌లు, వీడియోల‌ను.. క‌బ్జాలు, ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్న వారు హైడ్రాపై దుష్ప్రాచారానికి వాడుతున్నార‌ని మండిప‌డింది. ప‌ద్ధ‌తి ప్ర‌కారం హైడ్రాపై దుష్ప్ర‌చారం చేస్తున్నారని ఆరోపించింది. న‌గ‌రంలో ఫుట్ పాత్‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించ‌డం లేదని స్ప‌ష్ం చేసింది. హైకోర్టు ఆదేశాల మేర‌కు న‌గ‌రంలో ఫుట్ పాత్‌ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపును మూడు మున్సిప‌ల్ (జీహెచ్ ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) కార్పొరేష‌న్లు పెద్ద యెత్తున చేప‌ట్టాయని తెలిపింది.
ఈ క్ర‌మంలోనే పాత‌బ‌స్తీతో పాటు న‌గ‌రంలో అనేక ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను ఆయా మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు తొల‌గిస్తున్నాయని స్ప‌ష్టం చేసింది హైడ్రా. ఈ విష‌యాన్ని అంద‌రూ గ్ర‌హించాల‌ని సూచించింది. హైడ్రా భారీ ఆప‌రేష‌న్లు చేస్తుందని, బ‌డాబాబులు, క‌బ్జాదారుల ఆట‌క‌ట్టించి వారి ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గిస్తుందని తెలిపింది. ఇలా వంద‌లు, వేల ఎక‌రాల ప్ర‌భుత్వ భూముల (ప్ర‌జల ఆస్తిని)ను హైడ్రా కాపాడిందని వెల్ల‌డించింది. చెరువులు, నాలాలు, ర‌హ‌దారులు, పార్కుల ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపును హైడ్రా చేప‌డుతుందని పేర్కొంది.. రెవెన్యూ అధికారుల అభ్య‌ర్థ‌న మేర‌కు ప్ర‌భుత్వ భూముల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తుందని తెలిపింది. న‌గ‌రంలో గొలుసు క‌ట్టు చెరువుల‌ను పున‌రుద్ధ‌రించే ప‌నిలో హైడ్రా నిమగ్న‌మై ఉందని స్ప‌ష్టం చేసింది. వ‌ర్షాకాలం వ‌ర‌ద‌ల క‌ట్ట‌డి చేయ‌డమే ల‌క్ష్యంగా హైడ్రా ప‌ని చేస్తోంద‌ని, ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన న‌గ‌ర నిర్మాణం ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని, ఆ దిశ‌గా హైడ్రా ముందుకు సాగుతుంద‌ని తెలిపింది.
The post కూల్చివేత‌ల‌న్నీ హైడ్రాకు ఆపాదించ‌డం త‌గ‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జ‌ర్న‌లిస్టుల‌కు ఖుష్ క‌బ‌ర్ హెల్త్ స్కీం పొడిగింపుజ‌ర్న‌లిస్టుల‌కు ఖుష్ క‌బ‌ర్ హెల్త్ స్కీం పొడిగింపు

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది జ‌ర్న‌లిస్టుల‌కు. ఆరోగ్య స్కీంకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు మీడియాలో ప‌ని చేస్తున్న వారంద‌రికీ గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్

ఆర్జీల‌ వ్య‌వ‌స్థ‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలిఆర్జీల‌ వ్య‌వ‌స్థ‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు.ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్

రూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదంరూ.5,456.26 కోట్లతో టీటీడీ 2026–27 బడ్జెట్ ఆమోదం

తిరుమ‌ల : టీటీడీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. ఈ విష‌యాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల