hyderabadupdates.com Gallery గాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌న

గాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌న

గాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌న post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు మాజీ మంత్రి కేటీఆర్. త‌న‌కు తెలిసిన పాలన కేవలం ఇళ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమేనని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజల ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే తన పనిగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాజెక్టు గాని, ఒక్క ఇల్లు గాని, ఒక్క రోడ్డు గాని వేయకుండా కేవలం విధ్వంసమే తన విధానంగా పెట్టుకుని ముందుకు పోతున్నారని మండిప‌డ్డారు.
ఈరోజు హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున తమ ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం వారు నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో మూడున్నర కిలోమీటర్ల పాటు అనేకమంది బాధితులను కలుస్తూ కేటీఆర్ ముందుకు సాగారు.
ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని ప్ర‌క‌టించారు. తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, వేడుకున్నా, చివరికి పసిపాపల పట్ల కనికరం చూపాలని కోరినా, కర్కశంగా ఇళ్లను ఖాళీ చేయిస్తూ, బెదిరింపులకు దిగుతూ విధ్వంసానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
The post గాడి త‌ప్పిన పాల‌న కేటీఆర్ ఆందోళ‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాంరాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించాం

తాడేప‌ల్లి గూడెం : ఏపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ‘మావిగన్‌’ సూచించామని, దాని వల్ల రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం

మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌మ‌హిళ‌లు లేకుంటే ప్ర‌పంచ‌మే లేదు : ఎస్. స‌విత‌

అమ‌రావ‌తి : మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అనేది ఆర్యోక్తి అని, ఎక్కడైతే

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్స‌వాలుశ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్స‌వాలు

హైదరాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శాస్త్రోక్తంగా