hyderabadupdates.com movies చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి వస్తుందో చెప్పలేదు. నాలుగని ఒకరు ఇరవై అయిదని మరొకరు రెండు ఆప్షన్లు ప్రచారంలోకి తెచ్చారు. టాక్సిక్ ఒకవేళ వాయిదా పడే పక్షంలో ఆ డేట్ తీసుకుని జూన్ 4 లాక్ చేయాలనే ఆలోచనలో వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు. తేదీ సంగతి ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జరిగిపోతున్నాయి. మెయిన్ సెంటర్స్ డిస్ట్రిబ్యూటర్లు లాకైపోయారు.

పెద్దిని కాసేపు పక్కనపెడితే అసలు విశ్వంభర ఎందుకింత సైలెంట్ ఉందో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ సమస్యని చెప్పి 2024 నుంచి దాని మీద వర్క్ చేస్తున్నారు. ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ ఇప్పటిదాకా పని ఎంతదాక వచ్చిందో చెప్పలేదు. ఈలోగా దర్శకుడు వశిష్ఠ ఇంకోవైపు బాలకృష్ణకో కథ చెప్పి ఓకే చేయించుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉండాల్సిన తను వేరే ట్రయిల్స్ లో ఉన్నాడానేది ఫ్యాన్స్ డౌట్.

దీనికి క్లారిటీ రావాలంటే ముందు చరణ్ డేట్ డిసైడ్ కావాలి. పెద్దికి విశ్వంభరకు కనీస గ్యాప్ ఉండాలనేది చిరంజీవి సూచన. అసలే యువి క్రియేషన్స్ ఇబ్బందుల్లో ఉందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది. ఘాటీ డిజాస్టర్ అయ్యింది. కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ అనిపించుకున్నా తడిసిపోయే రేంజ్ లో కనకవర్షం కురవలేదు. బైకర్ ని అందరూ ఆకాశానికి ఎత్తే రేంజ్ లో పొగిడినా రెండు వారాల తర్వాత కూడా బ్రేక్ఈవెన్ చేరుకోలేదు. ఇప్పుడు విశ్వంభర సమస్య తీరాల్సి ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్యూర్ తో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కి ఊరట కలిగించాల్సింది ఈ రెండు సినిమాలే. ముఖ్యంగా పెద్ది మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. విశ్వంభర ప్రస్తుతానికి హైప్ తగ్గిపోయినట్టు అనిపిస్తున్నా రిపేర్ల తర్వాత అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంతర్గత వర్గాల సమాచారం. ఇప్పటికైతే రీ రికార్డింగ్ కోసం కీరవాణికి ఇంటిమేషన్ వెళ్లలేదట. ఫైనల్ కాపీ సిద్ధం కాగానే కబురు పెడతారని తెలిసింది. ఎలా చూసినా విశ్వంభర జూలైలో రావడం దాదాపు ఫిక్స్.

Related Post

ఐబొమ్మ ర‌వి రాబిన్ హుడ్డా… నాగ‌వంశీ అస‌హ‌నంఐబొమ్మ ర‌వి రాబిన్ హుడ్డా… నాగ‌వంశీ అస‌హ‌నం

టాలీవుడ్ నిర్మాత‌ల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీని ఫైర్ బ్రాండ్‌గా చెప్పొచ్చు. సినిమా వేడుక‌లైనా, ఇంట‌ర్వ్యూల్లో అయినా ఆయన చాలా అగ్రెసివ్‌గా, స్ట్రెయిట్‌గా మాట్లాడుతుంటారు. దీని వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో నాగ‌వంశీ ఇబ్బంది ప‌డ్డాడు కూడా. అయినా త‌న శైలేమీ మార‌దు. త‌న బేన‌ర్

6 Malayalam OTT releases to watch this week: Shabareesh Varma’s Inspection Bungalow to Avihitham6 Malayalam OTT releases to watch this week: Shabareesh Varma’s Inspection Bungalow to Avihitham

Cast: Unni Raj, Renji Kankol, Vineeth Chakyar, Dhanesh Koliyat, Rakesh Ushar, Vrinda Menon, Ajith Punnad, Unnikrishnan Parappa Director: Senna Hegde Runtime: 1 hour and 45 minutes Genre: Satirical Black Comedy

ప్రభాస్ గురించి జక్కన్న చెప్పింది నిజమేప్రభాస్ గురించి జక్కన్న చెప్పింది నిజమే

హీరోల్లో కొందరు బహుముఖ ప్రజ్ఞాశాలులు ఉంటారు. వాళ్లను అందరూ నటులుగానే చూస్తారు కానీ.. బయటికి కనిపించని వేరే టాలెంట్స్ చాలానే ఉంటాయి. అది వాళ్లతో కలిసి పని చేసిన, సన్నిహితులకు మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్‌