hyderabadupdates.com Gallery చేతులెత్తేసిన చెన్నై చెల‌రేగిన టైటాన్స్

చేతులెత్తేసిన చెన్నై చెల‌రేగిన టైటాన్స్

చేతులెత్తేసిన చెన్నై చెల‌రేగిన టైటాన్స్ post thumbnail image

చెన్నై : స్వంత గ‌డ్డ‌పై దారుణంగా ఓట‌మి పాలైంది మ‌రోసారి చెన్నై సూప‌ర్ కింగ్స్. ఆ జ‌ట్టుకు స్వంత స్థ‌లం అచ్చి రాన‌ట్టుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్ ల‌లో కేవ‌లం మూడు మ్యాచ్ లు మాత్ర‌మే గెలుపొందింది సీఎస్కే. ఎట్ట‌కేల‌కు ఈ మ్యాచ్ లో నిన్న‌టి వ‌ర‌కు ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి రావ‌డం. ఒకానొక ద‌శ‌లో 100 ప‌రుగులైనా చెన్నై జ‌ట్టు చేస్తుందా అన్న అనుమానం క‌లిగింది. కానీ రుతురాజ్, శివ‌మ్ దూబే నిల‌డ‌డంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. లేక‌పోతే సీఎస్కే ప‌రువు పోయి ఉండేది. ఐపీఎల్ లో సీఎక్కు జ‌ట్టుకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ టీంకు లేదు. ఆ మాత్రం గుర్తించ‌కుండా ప్లేయ‌ర్లు ఆడ‌టం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. కోట్లు పెట్టి తీసుకున్న సంజు శాంస‌న్ అడ‌పా ద‌డ‌పా ఆడ‌డం త‌ప్పితే ఆశించిన రీతిలో రాణించ‌డ‌క పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.
అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఆడ‌కుండా సెంచ‌రీ చేస్తే ఏం లాభం అని ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే గుజ‌రాత్ టైటాన్స్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో సీఎస్కేకు షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే మూడు జ‌ట్లు పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతోండ‌గా మిగ‌తా జ‌ట్లు ఒకే ఒక్క నాలుగో స్థానం కోసం పోటీ ప‌డుతున్నాయి. చివ‌రి నాలుగు స్థానంలో ఉండాలంటే ఇక‌నైనా అన్ని మ్యాచ్ లు సీఎక్కే గెల‌వాల్సిన ప‌రిస్తితి నెల‌కొంది. గుజ‌రాత్ స్కిప్ప‌ర్ గిల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవ‌డం స‌త్ఫ‌లితం ఇచ్చింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 158 ర‌న్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 74 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. అనంత‌రం గుజ‌రాత్ 16.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని కానిచ్చేసింది. సాయి సుద‌ర్శ‌న్ 46 బంతుల్లో 87 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 7 భారీ సిక్సులు ఉన్నాయి.
The post చేతులెత్తేసిన చెన్నై చెల‌రేగిన టైటాన్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురై , ఆ పార్టీ త‌ర‌పున ఎన్నికైన శాస‌న మండ‌లి స‌భ్యురాలి ప‌ద‌వికి రాజీనామా చేసి సంచ‌ల‌నంగా మారిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు

తిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాంతిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాం

వ‌రంగ‌ల్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప – లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు.

Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !Kochi: కేరళలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌ ! జనావాసాలపై 1.38 కోట్ల లీటర్ల నీరు !

    కేరళ వాటర్ అథారిటీ (KWA) ఫీడర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుప్పకూలింది. కేరళలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేడబ్ల్యూఏ నీటి ట్యాంక్‌ కూలడంతో 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా జనావాసాలపై గుమ్మరించినట్లు పడిపోయింది. దీంతో