hyderabadupdates.com Gallery టాక్సిక్ సెన్సేష‌న్ గీతూ మోహ‌న్ దాస్ వైరల్

టాక్సిక్ సెన్సేష‌న్ గీతూ మోహ‌న్ దాస్ వైరల్

టాక్సిక్ సెన్సేష‌న్  గీతూ మోహ‌న్ దాస్ వైరల్ post thumbnail image

బెంగ‌ళూరు : ఎవ‌రీ గీతూ మోహ‌న్ దాస్ అనుకున్నారా. త‌ను ఇప్పుడు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతోంది. దీనికి కార‌ణం త‌ను పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ తో మూవీ తీస్తోంది. ఆ సినిమాతో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న గురించి పెద్ద ఎత్తున గూగుల్ లో వెదుకుతుండ‌డం విశేషం. త‌ను మాజీ న‌టి. అంతే కాదు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతో టాక్సిక్ పేరుతో సినిమా తీస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కేజీఎఫ్ -2 త‌ర్వాత య‌శ్ న‌టిస్తున్న చిత్రం ఈ మూవీ. ఇక మూవీని హాలీవుడ్ రేంజ్ లో తీస్తోంది ద‌ర్శ‌కురాలు. ఇదిలా ఉండ‌గా న‌టుడి పుట్టిన రోజు సంద‌ర్బంగా రిలీజ్ చేసిన టీజ‌ర్ కు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో అటు న‌టుడు య‌శ్ ఇటు ద‌ర్శ‌కురాలు గీతూ మోహ‌న్ దాస్ లు ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు.
తాజాగా ఇందులో న‌టిస్తున్న హీరోయిన్ పోస్ట‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇదిలా ఉండ‌గా అస‌లు గీతూ మోహ‌న్ దాస్ గ‌తంలో న‌టిగా గుర్తింపు పొందారు. త‌ను అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించింది. కేర‌ళ లోని క‌న్నూర్ స్వ‌స్థ‌లం. ఫిబ్ర‌వ‌రి 14, 1981లో పుట్టింది. బాల న‌టిగా సినీ ప్ర‌స్తానాన్ని ప్రారంభించింది. ఒన్ను ముతుల్ పూజ్యం వార్ మూవీలో గీతు అనే పేరుతో మోహ‌న్ లాల్ తో క‌లిసి న‌టించింది. ఈ చిత్రంతో ఉత్త‌మ బాల న‌టిగా అవార్డు కూడా పొందింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , తెంకాసి ప‌ట్ట‌ణం, వాల్క‌న్న‌డి, అకాలే వంటి ప్ర‌ముఖ మ‌ల‌యాళ చిత్రాల‌లో న‌టించింది. అకాల్ లో ఉత్త‌మ న‌టి అవార్డు అందుకుంది గీతూ మోహ‌న్ దాస్. త‌ను చివ‌రి సినిమాగా న‌మ్మ‌ల్ త‌మ్మిల్ లో న‌టించింద‌.ఇ 2009 త‌ర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించింది. కెల్క్క‌న్నుండో మూవీ ద్వారా ద‌ర్శ‌క‌త్వ రంగంలోకి అడుగు పెట్టింది. మూడు అంత‌ర్జాతీయ అవార్డుల‌ను పొందింది. 2013లో ల‌య‌ర్స్ డైస్ తీసింది. రెండు జాతీయ అవార్డులు ద‌క్కాయి. మూథాన్ తో విజ‌య ప‌రంప‌ర‌ను సాగించింది. గ్లోబ‌ల్ ఫిల్మ్ మేక‌ర్ అవార్డు పొందింది. ఇక తాజాగా రాబోయే చిత్రం టాక్సిక్.
The post టాక్సిక్ సెన్సేష‌న్ గీతూ మోహ‌న్ దాస్ వైరల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలుVijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలు

Vijay Mallya : బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యా (Vijay Mallya)… దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల