hyderabadupdates.com Gallery టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్ post thumbnail image

ముంబై : వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ క్రికెట‌ర్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు అరుదైన ఛాన్స్ ల‌భించింది. తాజాగా ప్ర‌ముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌ను త‌మ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్ ను నియ‌మించిన‌ట్లు తెలిపింది. టెక్నో పెయింట్స్ 2026-27 నాటికి తన ఐపీఓ ద్వారా రూ. 500 కోట్లు సమీకరించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను దేశంలోనే కాదు వ‌ర‌ల్డ్ వైడ్ గా అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన ప్లేయ‌ర్ గా త‌న‌కు పేరుంది. త‌న‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించ‌డం వెనుక భారీ మార్కెట్ స్ట్రాట‌జీ దాగి ఉంద‌ని తేలి పోయింది. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఆస్తుల‌ను పోగేశాడు స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్. త‌ను ముందు నుంచి భ‌విష్య‌త్తు కోసం కొంత దాచుకోవ‌డం, పెట్టుబ‌డులు పెడుతూ వ‌చ్చాడు.
ఇదే స‌మ‌యంలో త‌న‌తో పాటు ఆడిన చిన్న‌నాటి స్నేహితుడు, ప్ర‌ముఖ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లి మాత్రం చెడు అల‌వాట్ల కార‌ణంగా త‌న జీవితాన్ని నాశ‌నం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం బీసీసీఐ ఇచ్చే నెల నెలా పెన్ష‌న్ తోనే బ‌తుకుతున్నాడు. ఆ మ‌ధ్య‌న అనారోగ్యానికి గురై ఆస్ప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో కొంత సాయం చేశాడు స‌చిన్ టెండూల్క‌ర్. ఇదిలా ఉండ‌గా పెయింట్స్ త‌యారీ సంస్థ మూడు సంవ‌త్స‌రాల పాటు త‌మ కంపెనీకి రాయ‌బారిగా ఉంటార‌ని తెలిపింది. కాగా గ‌త 25 సంవ‌త్స‌రాల పాటు పెయింట్స్ రంగంలో స్థిర‌మైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీని కార‌ణంగా మ‌రింత‌గా ఆదాయాన్ని పెంచుకునే దిశ‌గా పావులు క‌దిపింది. ఈ మేర‌కు స‌చిన్ తో ఒప్పందం ఖ‌రారు చేసుకుంది.
The post టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Nara Lokesh : పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం – మంత్రి లోకేష్Minister Nara Lokesh : పిల్లలకు నైతిక విలువలు చాలా అవసరం – మంత్రి లోకేష్

Nara Lokesh : నైతిక విలువలు, సమాజంలో మార్పుకు సంబంధించి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలువలు, విద్యా సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం,

Jyoti Singh: బిహార్ ఎన్నికల బరిలో స్టార్ హీరో భార్యJyoti Singh: బిహార్ ఎన్నికల బరిలో స్టార్ హీరో భార్య

Jyoti Singh : భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్‌… ఆయన భార్య జ్యోతీ సింగ్‌ ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తన భర్త స్త్రీ లోలుడంటూ జ్యోతీ సంచలన కామెంట్లు చేశారు. గృహ హింస

Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టోMahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో

Mahagathbandhan: బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌ (Mahagathbandhan) మ్యానిఫెస్టో విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్‌’ పేరుతో