hyderabadupdates.com Gallery ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్

ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్

ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్ post thumbnail image

న్యూఢిల్లీ : ఈ మధ్య‌న సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లిందంటూ కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌డం ప‌రిపాటిగా మారింది. తాజాగా ఈ జాబితాలోకి చేరి పోయాడు నేష‌న‌ల్ ఐకానిక్ స్టార్ హీరో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన టాప్ హీరో అల్లు అర్జున్. తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఒక దావా దాఖ‌లు చేశారు. ఈ కేసును జస్టిస్ తుషార్ రావు గెడెల ఈనెల 17న శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా పిటిష‌న్ లో త‌న ప‌ర్మిష‌న్ లేకుండా ఎలా ప‌డితే అలా ఫోటోలు, వీడియోలు , గొంతును వాడుకుంటున్నార‌ని ఆరోపించారు.
ప్ర‌త్యేకించి త‌న‌ సమ్మతి లేకుండా తన పేరు, చిత్రాలు, గొంతు వంటి వ్యక్తిత్వ లక్షణాలను ఉపయోగించడాన్ని నిరసిస్తూ నటుడు అల్లు అర్జున్ ఉపశమనం క‌లిగించేలా తీర్పు ఇవ్వాల‌ని కోరారు. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన వ్యక్తిత్వ హక్కులను వస్తువులపై వాణిజ్య పరంగా ఉపయోగించడాన్ని నిరసిస్తూ కూడా పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం విశేషం. కాగా అల్లు అర్జున్ కంటే ముందు హైకోర్టును ఆశ్ర‌యించిన వారిలో చాలా మంది న‌టులు ఉన్నారు.
మలయాళ నటుడు మోహన్‌లాల్, ఆధ్యాత్మిక ప్రబోధకుడు అనిరుద్ధాచార్య, గాయకుడు జుబిన్ నౌటియాల్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, నటులు కాజోల్ దేవగన్, ఆర్. మాధవన్, ఎన్టీఆర్ జూనియర్‌ల వ్యక్తిత్వ హక్కులను కోర్టు పరిరక్షిస్తోందని గమనించాలి. నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి దావానే దాఖ‌లు చేశారు. ఆ త‌ర్వాత బ‌న్నీ కూడా చేరి పోయాడు ఈ జాబితాలోకి.
The post ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలిశ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలి

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.

బ‌హుళ సౌక‌ర్య కేంద్రాలుగా స‌హ‌కార సంఘాలుబ‌హుళ సౌక‌ర్య కేంద్రాలుగా స‌హ‌కార సంఘాలు

అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 2021 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో (PACS) 2017 సంఘాలు 62.34 కోట్ల రూపాయల వ్యయంతో వ-PACS గా మార్పు చెందాయ‌న్నారు. ఇవి డిజిటల్ విధానంలో

జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌జూబ్లీహిల్స్‌లో నీరూస్ షోరూమ్ సీజ్‌

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్ న‌గ‌రంలో షోరూం య‌జ‌మానులు స‌రైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. ఈ మేర‌కు గురువారం ఆయ‌న స్వ‌యంగా