hyderabadupdates.com Gallery త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే విజ‌యం

త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే విజ‌యం

త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే విజ‌యం post thumbnail image

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో మ‌రోసారి డీఎంకే ఇండియా కూట‌మి మ‌రోసారి విజ‌యం సాధించ‌డం ప‌క్కా అని జోష్యం చెప్పారు ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా హూసూర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌సంగించారు. తమిళనాడు పెరియార్, అన్నా, కళైజ్ఞర్ వంటి నాయకులు పుట్టిన‌ గడ్డ అని ప్ర‌శంసించారు. వీరు భారతదేశానికి గౌరవం, హేతుబద్ధమైన ఆలోచన, సమానత్వం అర్థాన్ని బోధించారన్నారు ఖర్గే. ఈనాడు ద్రవిడ మున్నేట్ర కజగం నాయకత్వంలో, భారత జాతీయ కాంగ్రెస్‌తో దాని పొత్తులో, ఆ ఆదర్శాలు కేవలం స్మరించు కోవడమే కాదు వాటిని ఆచరిస్తున్నార‌ని అంతే కాకుండా పరిరక్షిస్తున్నారు, బలోపేతం చేస్తున్నారని చెప్పారు. .
తమిళనాడు ప్రజల వివేకంపై నాకు పూర్తి విశ్వాసం ఉంద‌న్నారు. మీరు ఎల్లప్పుడూ లౌకికవాదం, బహుళత్వం, సామాజిక న్యాయం కోసం నిలబడ్డారని అన్నారు. ఇప్పుడు మరోసారి మేల్కొనాల్సిన సమయం వచ్చిందన్నారు. భారీ సంఖ్యలో బయటకు రావాల‌ని, తిరు స్టాలిన్ చేతులను బలోపేతం చేయాల‌ని పిలుపునిచ్చారు ఖ‌ర్గే. లౌకిక ప్రగతిశీల కూటమిని బలోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విభజన శక్తులకు వ్యతిరేకంగా తమిళనాడు ఒక బలమైన గోడను నిర్మించాలని కోరారు. కేవలం తన కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం. మే 4వ తేదీ ఫలితాలు భారతదేశమంతటా ఒక సందేశాన్ని పంపాలన్నారు. ప్రజలు ద్వేషాన్ని తిరస్కరించి, సామరస్యాన్ని ఎంచుకున్నారని తెలియ చెప్పాల‌న్నారు.
కలిసికట్టుగా మనం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. కలిసికట్టుగా, మనం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కలిసికట్టుగా, మనం మరింత బలమైన, మరింత సమ్మిళిత భారతదేశాన్ని నిర్మిద్దాం అని కోరారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే.
The post త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000Matsya-6000: సముద్ర అన్వేషణకు దేశీయ సముద్రయాన వాహనం మత్స్య–6000

  సముద్ర అంతర్భాగంలోని రహస్యాలను ఛేదించడానికి భారత ఆక్వానాట్స్‌ రమేశ్‌ రాజు, జతీందర్‌పాల్‌ సింగ్‌ సిద్ధమవుతున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ‘మత్స్య–6000’సముద్రయాన వాహనంలో వచ్చే ఏడాది ఆరంభంలో సాగర మథనం చేయబోతున్నారు. 28 టన్నుల బరువైన ఈ వాహనం సముద్రంలో

బంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీబంగ్లాదేశ్ ఇండియాలో ఆడాల్సిందే : ఐసీసీ

దుబాయ్ : భ‌ద్ర‌తా కార‌ణాల పేరుతో వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రిలో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వహించే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాము పాల్గొనేది లేదంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ మేర‌కు త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ మైదానాలు