hyderabadupdates.com Gallery తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్

తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్

తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని పుట్టిస్తున్నాయి. ఇప్ప‌టికే బీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురై , ఆ పార్టీ త‌ర‌పున ఎన్నికైన శాస‌న మండ‌లి స‌భ్యురాలి ప‌ద‌వికి రాజీనామా చేసి సంచ‌ల‌నంగా మారిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఇవాళ తాను ఏర్పాటు చేసిన క‌మిటీల‌తో హైద‌రాబాద్ లోని త‌న కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భారత దేశంలో అత్యంత పేరు పొందిన ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ తో స‌మావేశాలు జ‌రిపార‌ని, ఇందు కోసం త‌న సంస్థ‌ను పార్టీగా మార్చే యోచ‌న‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత ఉన్న‌ట్లు స‌మాచారం . ఈ మేర‌కు ఇద్ద‌రి మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అవి ఫ‌ల‌ప్ర‌దం అయ్యాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.
రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌ల లోపు తాను ప‌వ‌ర్ సెంట‌ర్ కావాల‌ని డిసైడ్ అయ్యారు క‌విత‌. ఇందులో భాగంగానే ఆమె అయిన వారిని, క‌న్న వారిని, కుటుంబీకుల‌ను , బంధాల‌ను సైతం వ‌దులుకుంది. అంతే కాకుండా శాస‌న మండ‌లిలో సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు పార్టీని, త‌న తండ్రిని కూడా. ఈ క్ర‌మంలో తాను సీరియ‌స్ గా పాలిటిక్స్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. కవిత ఇటీవల ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కిషోర్‌తో చర్చలు జరిపినట్లు టాక్. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో తన తండ్రి ప్రతిష్టను తన బంధువులు, నాయకులైన టి హరీష్ రావు , జె సంతోష్ కుమార్ క‌ళంకం తెచ్చేలా ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. మొత్తం మీద క‌విత ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్ గా మారారు.
The post తెలంగాణ జాగృతి కోసం ప్ర‌శాంత్ కిషోర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Marriage in ICU: ఐసీయూలో వివాహం చేసుకున్న కొత్త జంట !Marriage in ICU: ఐసీయూలో వివాహం చేసుకున్న కొత్త జంట !

    పెళ్లి అంటే నూరేళ్ళ పంట. అందుకే దీనిని ఎన్నో కలలు, మరెన్నో కోరికలతో ఒక పండుగా చేసుకుంటారు. జీవితంలో ఒకే సారి జరిగే ఈ తంతు కోసం కోట్లు ఖర్చు చేసిన సందర్భాలు ఎన్నో. ఈ నేపథ్యంలో కేరళలోని

ఏపీని టూరిజం బ్రాండ్ గా తీర్చిదిద్దుతాంఏపీని టూరిజం బ్రాండ్ గా తీర్చిదిద్దుతాం

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శాసనసభ బడ్జెట్ సెషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి మ‌నోహ‌ర్ తో క‌లిసి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో, ఉప ముఖ్యమంత్రి

గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్

అమరావతి : గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామ‌ని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ