hyderabadupdates.com movies తెలివైన స్ట్రాటజీతో ఎన్టీఆర్ & నీల్

తెలివైన స్ట్రాటజీతో ఎన్టీఆర్ & నీల్

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ క్రమంగా వేగం పుంజుకుంటోంది. యుద్ధ వాతావరణం వల్ల ఇటీవలి జోర్దాన్ షెడ్యూల్ ని అనుకున్న టైం కన్నా ముందే పూర్తి చేసుకుని వచ్చిన టీమ్ బాలన్స్ పోర్షన్ ని హైదరాబాద్ లో సెట్స్ వేసి తీస్తున్నారు. జూన్ లేదా జూలైలో విడుదల కావడం సాధ్యం కాదు కాబట్టి ఆ మేరకు త్వరలోనే వాయిదా ప్రకటన రావొచ్చు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ – నీల్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా తెలివైన ఎత్తుగడతో వెళ్తున్నారని సమాచారం. అంటే సీక్వెల్ కు సంబంధించిన కొన్ని భాగాలు ఇప్పుడే తీస్తున్నారట. వ్యయాన్ని తగ్గించడం కోసం, తారక్ డేట్లు వృథా కాకుండా ఇలా ప్లాన్ చేస్తున్నారన్న మాట. ఇంకా చెప్పాలంటే దురంధర్ తరహాలో టూ పార్ట్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా సరైన ప్రణాళికతో చేస్తున్న చక్కని స్ట్రాటజీ ఇది. మొదటి భాగం రిలీజయిన వెంటనే సీక్వెల్ మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారు.

పుష్ప, బాహుబలి, కాంతార, కెజిఎఫ్ ఈ మార్గాన్ని పాటించలేదు. అందుకే రెండు భాగాల మధ్య రెండు నుంచి మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆదిత్య దార్ అలా జరగకూడదనే దురంధర్ కి కేవలం మూడు నెలల స్పేస్ పెట్టుకుని అదే మాట మీద నిలబడ్డాడు. వాయిదా పడుతుందనే పుకార్లను తట్టుకుని చెప్పిన డేట్ కె దురంధర్ రివెంజ్ రావడం వెనుక, టాక్సిక్ వెనుకడుగు చేయడం వెనుక ఆదిత్య ధార్ అద్భుతమైన ప్లానింగ్ తప్ప మరొకటి కాదు.

ఎన్టీఆర్ – నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. పలు ఆప్షన్లు చూస్తున్నారట. సలార్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఆయన మీద అంచనాలు మాములుగా లేవు. ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని ఒక హిస్టారికల్ మాఫియా డ్రామాని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్టు యూనిట్ టాక్. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న డ్రాగన్ లో తారక్ పాత్ర ఊహించని విధంగా రెండు మూడు షేడ్స్ లో ఉంటుందట.

Related Post

Chiranjeevi’s Personality Rights: Hyderabad Court grants InjunctionChiranjeevi’s Personality Rights: Hyderabad Court grants Injunction

A Hyderabad based court today has granted an ad-interim injunction in favour of Megastar Chiranjeevi. The order is issued to protect Chiranjeevi’s personality and publicity rights, including the unauthorised commercial

జంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీంజంపింగుల‌కు మ‌రో 4 వారాల గ‌డువు: సుప్రీం

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి 2023 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని.. త‌ర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం మ‌రోసారి సుప్రీంకోర్టులో విచారణ‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో త‌న‌కు స‌మ‌యం కావాలంటూ.. స్పీక‌ర్