hyderabadupdates.com Gallery ద‌ళిత క్రిష్టియ‌న్లపై తీర్పు రాజ్యాంగ విరుద్దం

ద‌ళిత క్రిష్టియ‌న్లపై తీర్పు రాజ్యాంగ విరుద్దం

ద‌ళిత క్రిష్టియ‌న్లపై తీర్పు రాజ్యాంగ విరుద్దం post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత బాధాక‌ర‌మ‌ని అన్నారు. ఇది పూర్తిగా భార‌త రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉంద‌న్నారు. ఇవాళ ప్ర‌ధాన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ మోదీ, అమిత్ షా చేతుల్లో ఉన్నాయ‌ని, చివ‌ర‌కు న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను కూడా త‌మ కంట్రోల్ లోకి తీసుకున్న‌ట్లు ఈ తీర్పు ద్వారా అనిపిస్తోంద‌ని పేర్కొన్నారు ష‌ర్మిలా రెడ్డి. రాజ్యాంగ స్ఫూర్తికి ఇలాంటి తీర్పులు దెబ్బతీస్తాయని అభిప్రాయ‌ప‌డ్డారు. ⁠ఇలాంటి తీర్పులు ప్రజల హక్కులను కాల‌రాస్తాయ‌న్నారు. ⁠ఆర్టికల్ 14, 15, 25 ఇవేమీ పరిగణనలోకి సుప్రీం కోర్టు తీసుకోలేదని ఆరోపించారు . ఒకే రాజ్యాంగంలో ఉన్న వివిధ ఆర్టికల్స్ లో విభిన్న అంశాలు ఉన్నాయ‌న్నారు. ఇలా ఉండకుండా ఒకే విధానాలు ఉండాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ⁠కులం అనేది పుట్టుకతో వస్తుందని, అది సామాజిక వ్యాధిగా మారింద‌న్నారు.
కులం అనేది ఒక వివక్ష . సమాజంలో కుల వివక్ష ఇంకా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ⁠దళితులు క్రిస్టియన్ గా మారితే వారి ఆర్ధిక స్థితి మారలేదన్నారు. త‌న‌ సామాజిక స్థితి మారడం లేద‌న్నారు. అవమానాలు , దాడులు తగ్గడం లేదని వాపోయారు. ⁠దళితులను దళితులుగానే చూస్తున్నార‌ని, ⁠దళితుల మీద దాడులు అరికట్టడానికే కొన్ని చట్టాలు ,ఎట్రాసిటీ యాక్ట్ లు ఉన్నాయన్నారు ష‌ర్మిలా రెడ్డి.
⁠ST మతం మారితే ST గానే ఉన్నాడు .. BC మతం మారినా బీసీ గానే ఉన్నాడు .. OC మతం మారినా ఓసీ గానే ఉన్నాడ‌న్నారు. ⁠ఒక్క SC లోనే మతం మారితే కులం ఎలా మారుతుంది ? ఇది చాలా దురదృష్ట‌క‌ర‌మ‌న్నారు. కులం అనేది పుట్టుకతో వస్తుంది అని నిన్నటి తీర్పులో సుప్రీమ్ కోర్టు ఒప్పుకుందన్నారు. ఆర్డర్ 1950 పేరాగ్రాఫ్ 3 లో హిందువులు, సిక్కులు, బుద్ధులు మాత్రమే ఉంటే ఎలా అని ప్ర‌శ్నించారు.
The post ద‌ళిత క్రిష్టియ‌న్లపై తీర్పు రాజ్యాంగ విరుద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పుఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు

రాయ‌చూర్ జిల్లా : క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ జిల్లాలో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇప్ప‌టికే ఇరు వ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న ఆధిప‌త్య పోరు చివ‌ర‌కు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒక‌రు మృతి

గ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతిగ్రాకా మాచెల్ కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

ఢిల్లీ : మొజాంబిక‌న్ సామాజిక కార్య‌క‌ర్త గ్రాకా మాచెల్ కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌న‌కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఇందిరాగాంధీ శాంతి బహుమ‌తి ద‌క్కింది. ఇదిలా ఉండగా గ్రాకా మాచెల్ విద్య , ఆరోగ్యంలో విశేషంగా కృషి చేశారు. 2025 ఇందిరా

మే నెల దర్శన కోటా టీటీడీ రిలీజ్మే నెల దర్శన కోటా టీటీడీ రిలీజ్

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి ఆల‌య పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం మే నెల ద‌ర్శ‌నం కోటాకు సంబందించి వెల్ల‌డించింది. 2026 మే నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు