hyderabadupdates.com Gallery న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్

న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్

న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్ post thumbnail image

హైద‌రాబాద్ : న‌టి అన‌న్య నాగళ్ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో పాటు మ‌రో న‌టి విష్ణుప్రియ భీమ‌నేని ఇద్ద‌రిపై పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కొన‌సాగుతోంది. ఈ ఇద్ద‌రూ ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా సబ్‌స్క్రిప్షన్ కు శ్రీ‌కారం చుట్టార‌ని, దీని ద్వారా త‌మ‌కు సంబంధించిన అందాల‌ను ఆర‌బోసే కార్య‌క్ర‌మం స్టార్ట్ చేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతే కాకుండా ప్ర‌జా సంఘాల‌కు చెందిన నాయ‌కులు, విద్యార్థి నేత‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు.
ఇదే కోవ‌లో తాను కూడా త‌క్కువ కాదంటూ అన‌న్య నాగ‌ళ్ల సైతం ఇన్ స్టాగ్రామ్ లో స‌బ్ స్క్రిప్ష‌న్ కు తెర లేపింది. దీనిపై ఫ్యాన్స్ భ‌గ్గుమ‌న్నారు. ఇదేం దందా అంటూ మండిప‌డ్డారు. అవ‌కాశాలు రాక‌పోతే వేరే ప‌ని చేసుకోవాలే త‌ప్పా ఇలా అందాల‌ను ఎర‌గా వేసి యువ‌త‌ను చెడ‌గొడితే ఎలా అని ప్ర‌శ్నించారు. దీనిపై తీవ్ర దుమారం చెల‌రేగ‌డంతో న‌టి అన‌న్య నాగ‌ళ్ల క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇందుకు సంబంధించి 2025లోనే సబ్‌స్క్రిప్షన్‌ గురించి వీడియో చేసి రిలీజ్ చేశానంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్ చేసింది అనన్య నాగ‌ళ్ల‌.
ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ గురించి కొన్ని అనవసరమైన కామెంట్లు చూస్తున్నానని.. అందుకే వివరణ ఇస్తున్నట్లు వెల్లడించింది. తాను ఏమీ అందాల‌ను ఆర బోయ‌డం లేద‌ని పేర్కొంది. ఎవ‌రైనా స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకోవ‌చ్చ‌ని, అది త‌మ వ్య‌క్తిగ‌త‌మ‌ని, దానిని ప్ర‌శ్నించే హ‌క్కు ఎవ‌రికీ లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. త‌మ గురించి మాట్లాడటం కంటే ఇత‌ర సినీ హీరోయిన్ల గురించి కూడా మాట్లాడితే బెట‌ర్ అని పేర్కొంది.
The post న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎంబాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

న్యూఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న‌తో పాటు మంత్రులు, ఉన్న‌తాధికారులు కూడాఉన్నారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషితో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

అన్నమయ్య తొలి శతకం భక్తి మార్గానికి దివ్య మార్గదర్శకంఅన్నమయ్య తొలి శతకం భక్తి మార్గానికి దివ్య మార్గదర్శకం

తిరుపతి : తెలుగు భక్తి సాహిత్యంలో అగ్రగణ్యులైన తాళ్ళపాక అన్నమాచార్యులు తొలి వాగ్గేయకారుడిగా విశిష్ట స్థానాన్ని పొందారని అన్నారు విశ్రాంతి తెలుగు ఆచార్యులు శ్రీ గిరిజా మనోహర్ బాబు. సంకీర్తనలలో భాగంగా రూపొందిన “తొలి శతకం” భక్తి, తత్వ, సాహిత్య పరంగా

Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్Prashant Kishore: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు – ప్రశాంత్ కిశోర్

    బిహార్‌ ఎన్నికల వేళ ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం జరిపిన పంపకాలపై ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్‌పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం